– బీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్
స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం తిరిగి ఇస్తానని సిగ్గు శరం లేకుండా రేటెంత రెడ్డి మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. నీకు అడ్డు అదుపు లేని స్వేచ్ఛ ఉంది కాబట్టే సజావుగా కొనసాగుతున్నటువంటి ప్రజలు ఎన్నుకున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని నీవు కుట్రతో కూల్చాలనుకున్నప్పటికీ ఇప్పటివరకు జైల్లో ఉండకుండా బయట తిరుగుతున్నావు. రేటెంత రెడ్డి, నీకు అపరిమిత స్వేచ్ఛ ఉంది కాబట్టే, ఎక్కడికక్కడ బ్లాక్మెయిలు, దందాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇంకా జైలులో లేవు.
నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది కాబట్టే, నిర్లజ్జగా ఆర్టిఐ అప్లికేషన్ల ద్వారా ఇంకా ఇతరత్రా మాధ్యమాల ద్వారా మోసాలు చేస్తూ మాఫియా లెక్క వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు దోపిడికి పాల్పడుతున్నాడని ఆరోపణలు వస్తున్న రేటెంత రెడ్డి జైల్లో ఉండకుండా బయట ఉండు. తెలంగాణ సాధన కోసం అనేక త్యాగాలు, కష్టాలు, నష్టాలు భరించి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారి పైన వారి కుటుంబ సభ్యుల పైన; ఆఖరికి చిన్న పిల్లవాడని చూడకుండా హిమాన్షు లాంటి అబ్బాయిపై కూడా వదరుబోతు లెక్క బూతు మాటల దాడి చేసిన రేటెంత రెడ్డి ఇంకా జైలులో లేడు అంటే తెలంగాణలో స్వేచ్ఛ ఉన్నట్టే… ఇంకా ఏం స్వేచ్ఛ కావాలి రేటెంత రెడ్డి?
నీకు ఇంకా ఏం బూతులు తిట్టడానికి స్వేచ్ఛ కావాలి?
ఇంకా ఏం రియల్ ఎస్టేట్ దందాలు వసూళ్లు చేయడానికి స్వేచ్ఛ కావాలి?
ఇంకా ఏం భూ కబ్జాలు చేయడానికి స్వేచ్ఛ కావాలి?
ఇంకా ఏం సెటిల్మెంట్లు చేయడానికి స్వేచ్ఛ కావాలి?
కెసిఆర్ పాలనలో తెలంగాణాలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది..
కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా , ప్రజలంతా సమానత్వంగా బతుకుతున్నారు. ప్రజాస్వామిక వాతావరణం లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవాళ రేటెంత రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..
రేటెంత రెడ్డి ఇంకా ఏమిట్లకు ఏమి కాలేదు. నువ్వు కేవలం ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉండి
నిరంకుశ చక్రవర్తి లెక్క వ్యవహరిస్తూ పార్టీలో ఉన్నటువంటి బీసీ,దళిత గిరిజన, మైనారిటీ నాయకులందరినీ అణచివేస్తూ, చిల్లర రాజకీయ వ్యాపారానికి పాల్పడుతూ సీట్లు అమ్ముకుంటు, మనీ లాండరింగ్ కు పాల్పడుతూ. గాంధీభవన్ ను గాడ్సే భవన్ గా మార్చి కాంగ్రెస్ పార్టీని సొంత ఫ్రాంచైజీ లెక్క, ప్రైవేట్ ఎస్టేట్ లెక్క నడుపుతున్న రేటెంతరెడ్డి జైళ్లలో ఉండాలి, కానీ స్వేచ్ఛగా బయట ఉండి ప్రజాస్వామ్యం గురించి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు తస్మాత్ జాగ్రత్త… నిన్ను కొడంగల్ లోనే నీవు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మరోసారి తప్పక మట్టి కరిపిస్తాం నిన్ను అసెంబ్లీ మెట్లు ఎక్కవు.. నీ ఖేల్ ఖతం… కాస్కో రేటెంత రెడ్డి