– ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్
కేసీఆర్, ఎమ్మెల్యేలకు కొంచింగ్ సెంటర్లు పెట్టమని చెబుతున్నారు. ఎనిమిదేళ్ళుగా ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చితంగా, ప్రజా వ్యతిరేకత తగ్గించుకోవడం కోసం కోచింగ్ సెంటర్ల డ్రామాలు ఆడుతున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చుపిస్తున్నాటు.. ‘రేపు పది గంటలకు టీవీలు చూడండి’ అని ప్రకటించారు. తీరా కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు 90వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన ముమ్మాటికీ నిరుద్యోగుల నోట్లో మన్నుకొట్టడమే. ఈ ప్రకటన వెనుక ఎలాంటి కసరత్తు జరగలేదు. ప్రకటన చేసినప్పటి నుంచి ఈవాల్టి వరకూ నోటీఫికేషన్ కి సంబధించిన ఊసు లేదు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన ఆయుధాలు లేకుండ యుద్ధం ప్రకటించడం లాటిందే.
ఖాళీలు, సర్వీస్ నిబంధనల మేరకు అభ్యర్థుల అర్హతలు, రిజ్వరేషన్లు, రోస్టర్ తదితర సమాచారన్ని సంబందిత శాఖలు అందించి, తదనంతరం ఆర్థిక శాఖకు అందించిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నారు సిఎస్ చెబుతున్నారు. ఈ ప్రక్రియకి ఎన్ని రోజులు పడుతుంది ? ఇంతకాలం ఏం చేశారు ? రోస్టర్ విధి విధానాలని ఎందుకు పూర్తి చేశారు ? ఇంతకాలం గుడ్డిగుర్రం పళ్ళు తోమారా ?
కేసీఆర్ ప్రకటన నిరుద్యోగుల జీవితాలతో కాలయాపన చేయడమే తప్పా కమిట్మెంట్ లేదు. సంచలనం కోసం చేసిన ప్రకటన తప్పా సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రకటన కాదు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ బోర్డ్ కు ఇవ్వడం అంటేనే బోగస్. బోర్డ్ కి ఒక ఐఎఎస్ అధికారి బోర్డ్ కమీషనర్ గా ఉంటాడు. అతను సంబదింత మంత్రి కింద పని చేస్తాడు. అంటే ఉద్యోగాల భర్తీని కూడా ఒక రాజకీయ కుట్రగా మార్చేసి టీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రభుత్వం కొమ్ముకాసే వారికి ఉద్యోగాలు ఇచ్చే కుట్ర జరుగుతుంది.
అన్నిటికి రిక్రూట్మెంట్ బోర్డులు పెట్టుకుంటే టీఎస్పీఎస్సి ఎందుకు ? ప్రజల ఖజానా నుంచి టీఎస్పీఎస్సి కి జీతాలు చెల్లించే బదులు మూసేయోచ్చు కదా.. కేసీఆర్ బోర్డుల తమాషా బంద్ చేసి, అన్ని ఉద్యోగాలు టీఎస్పీఎస్సి ద్వారానే భర్తీ చేయాలి.”కుక్కపిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అనే శ్రీశ్రీ మాటని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదేది రాజకీయానికి అనర్హంగా మార్చేసిన తన రాజకీయ లభ్ది కోసం చివరికి నిరుద్యోగుల జీవితాలతో నీచమైన రాజకీయం చేస్తున్నారు ” అని విమర్శించారు ఏఐసిసి జాతీయా అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ .గాంధీ భవన్ లో నిరుద్యోగ సమస్యపై పత్రిక సమావేశం నిర్వహించారు.
”2004నుంచి 2014వరకూ తెలంగాణ యవత తమ భవిష్యత్ ని పణంగా పెట్టి ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశారు. ఆత్మతర్పణలు కూడా చేశారు. 2014 నుంచి నేటి వరకూ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని వాగ్ధానం చేసిన పెద్దమనిషి ఎప్పుడు ఉద్యోగం ఇస్తారోని నిరీక్షించారు. దాదాపు 18 ఏళ్ళు. అంటే రెండు జనరేషన్లు నిరుద్యోగ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్న పరిస్థితి. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరుగుతుందని ఆశపడ్డ తెలంగాణ యువత నోట్లో మన్ను కొట్టిన విధంగా ముఖ్యమంతి కేసీఆర్ కాలయాపన చేశారు” అని విమర్శించారు దాసోజు.
”కేసీఆర్ కాలయాపన కారణంగా చాలా మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేరుకున్నారు. వుద్యోగం కోసం ఎదురుచూస్తూ .. కోచింగ్ సెంటర్లలో ఉండలేక, హాస్టల్ ఫీజులు కట్టలేక, ఇంట్లో మొహం చూపించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కుంభకర్ణుడు నిద్రలేచినట్లు, ప్రశాంత్ కిషోర్ సర్వే చేసి తెలంగాణ నిరుద్యోగ యువత ప్రభుత్వంపై అసంతృప్తితో వున్నది చెబితే.. అదేదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చుపిస్తున్నాటు.. ‘రేపు పది గంటలకు టీవీలు చూడండి’ అని ప్రకటించారు. తీరా కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు 90వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన ముమ్మాటికీ నిరుద్యోగుల నోట్లో మన్నుకొట్టడమే. బిశ్వాల్ లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు వున్నాయని రిపోర్ట్ ఇస్తే 90వేల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రకటన చేయడం వెనుక కూడా ఎలాంటి కసరత్తు జరగలేదు. ప్రకటన చేసినప్పటి నుంచి ఈవాల్టి వరకూ నోటీఫికేషన్ కి సంబధించిన ఊసు లేదు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన ఆయుధాలు లేకుండ యుద్ధం ప్రకటించడం లాటిందే” అని దుయ్యబట్టారు దాసోజు.
”సిఎం కేసీ అసెంబ్లీలో మాట్లాడుతూ వెంటనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. కానీ చీఫ్ సెక్రటరీ మాత్రం.. ఖాళీలు, సర్వీస్ నిబంధనల మేరకు అభ్యర్థుల అర్హతలు, రిజ్వరేషన్లు, రోస్టర్ తదితర సమాచారన్ని సంబందిత శాఖలు అందించి, తదనంతరం ఆర్థిక శాఖకు అందించిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియకి ఎన్ని రోజులు పడుతుంది ? ఇంతకాలం ఏం చేశారు ? రోస్టర్ విధి విధానాలని ఎందుకు పూర్తి చేశారు ?
ఇంతకాలం గుడ్డిగుర్రం పళ్ళు తోమారా ? ముఖ్యమంత్రి ప్రకటన చేసినప్పటికే ఈ ప్రక్రియనంతా ఎందుకు పూర్తి చేయలేదు ? ముఖ్యమంత్రి ప్రకటన ఎంత భాద్యతరాహితంగ వుందో చీఫ్ సెక్రటరీ మాటలు వింటే అర్ధమౌతుంది. సైన్యం ఆయుధాలు లేకుండా యుద్ధం ప్రకటించినట్లు కేసీఆర్ బాధ్యతరాహితమైన ప్రకటన చేశారు. కేసీఆర్ ప్రకటనలో మరోసారి నిరుద్యోగుల జీవితాలతో కాలయాపన తప్పా కమిట్మెంట్ లేదు. సంచలనం కోసం చేసిన ప్రకటన తప్పా సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రకటనలా అనిపించడం లేదు ” అని విమర్శించారు దాసోజు.
బోర్డుల ద్వారా కేసీఆర్ కుట్ర.. ఉద్యోగాలు టీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చేలా పన్నాగం :
”చీఫ్ సెక్రటరీ మాటల్లో మరో పెద్ద కుట్ర వుంది. పబ్లిక్ సర్విస్ కమీషన్ పరిధిలో పోస్టుల వుంటే కమీషన్ కి సమాచారం ఇవ్వాలి. లేదంటే సంబధిత బోర్దులకు సమాచారం ఇవ్వండని చీఫ్ సెక్రటరీ చెబుతున్నారు. ఈ మాట వెనుక పెద్ద కుట్రకోణం వుంది. బోర్డ్ కు ఇవ్వడం అంటేనే బోగస్. బోర్డ్ కి ఒక ఐఎఎస్ అధికారి బోర్డ్ కమీషనర్ గా ఉంటాడు. అతను సంబదింత మంత్రి కింద పని చేస్తాడు. అంటే ఉద్యోగాల భర్తీని కూడా ఒక రాజకీయ కుట్రగా మార్చేసి టీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రభుత్వం కొమ్ముకాసే వారికి ఉద్యోగాలు ఇచ్చే కుట్ర జరుగుతుంది. టీఎస్పీఎస్సి ఎందుకుంది ?రాజ్యంగబద్ధమైన సంస్థ టీఎస్పీఎస్సి ? టీఎస్పీఎస్సి ఒక చైర్మన్ ఏడుగురు కమీషనర్లు, అనుభవం , నైపుణ్యం అన్నీ వున్నాయి. వీరందరిని పక్కమన పెట్టి బోర్డు కి ఇవ్వడం ఏమిటి ? అని ప్రశ్నించారు దాసోజు.
”రద్దు చేసిన డిస్ట్రిక్ సెలక్షన్ కమీషన్ ని మళ్ళీ పునరుద్దరిస్తామని చెబుతున్నారు. ఐఎస్ఎస్ అధికారి దీనికి కమీషినర్ గా వుంటారు. ఐఎఎస్ ల పనితీరు తెలంగాణలో ఎలా వుందో చూసాం. ఎమ్మెల్యేకి కూడా వంగి దండాలు పెట్టె పరిస్థితి నెలకొంది. ఇలాంటి వారు కమీషినర్ గా వుంటే ఎమ్మెల్యే, ఏంపీ, మంత్రి చెప్పిన వారికి ఉద్యోగాలు వస్తాయి తప్పా మెరిట్ ని అనుసరించి వుద్యోగం వస్తుందా ? అని ప్రశ్నించారు దాసోజు.
వైద్య, ఆర్ధిక, గురుకుల, రెవెన్యు ఇలా అన్నిటికి రిక్రూట్మెంట్ బోర్డులు పెడుతున్నారు. మరి టీఎస్పీఎస్సి ఎందుకు ? ప్రజల ఖజానా నుంచి టీఎస్పీఎస్సి జీతాలు చెల్లిస్తున్నాం కదా.. అన్నిటికి రిక్రూట్మెంట్ బోర్డులు పెట్టుకుంటే టీఎస్పీఎస్సి ఎందుకు ? మూసేయోచ్చు కదా.. దయచేసి కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం మానేయాలి. బోర్డుల తమాషా బంద్ చేసి అన్ని ఉద్యోగాలు టీఎస్పీఎస్సి ద్వారానే భర్తీ చేయాలి” డిమాండ్ చేశారు దాసోజు.
”సిఎం కేసీఆర్, ఎమ్మెల్యేలకు కొంచింగ్ సెంటర్లు పెట్టమని చెబుతున్నారు. ఎనిమిదేళ్ళుగా ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చితంగా, ప్రజా వ్యతిరేకత తగ్గించుకోవడం కోసం కోచింగ్ సెంటర్ల డ్రామాలు ఆడుతున్నారు. అడ్డదిడ్డంగా సంపాయించుకున్న డబ్బులు వున్నాయి కాబట్టి పెడుతున్నారని అనుకోవచ్చు. ఇందులో తప్పులేదు. కానీ ఇందులో పెద్ద రాజకీయ కుట్ర వుంది.
కోచింగ్ సెంటర్ల ద్వారా అందరినీ మచ్చిక చేసుకొని మంచి భోజనం వసతి కల్పించి మళ్ళీ ఓట్లు గుద్దించుకోవాలనేది ఒక ప్రయత్నం. బోర్డుల ద్వారా నియామకం అంటున్నారు కాబట్టి రాజకీయ పలుకుబడి వున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే కుట్ర కూడా ఈ కోచింగ్ సెంటర్ల ద్వారా జరుగుతుంది” అని వెల్లడించారు దాసోజు.
”స్టడీ సెంటర్ల బాధ్యత ప్రభుత్వానిది. బీసి, ఎస్సి, ఎస్టీ వెల్ఫర్ డిపార్ట్మెంట్లు వున్నాయి. వీళ్ళందరికీ స్టడీ సెంటర్లు వున్నాయి. మరి స్టడీ సెంటర్ల ద్వారా కోచింగ్ ఇవ్వకుండ ఎమ్మెల్యే ద్వారా కోచింగ్ సెంటర్లు ఇస్తున్నారు ? అని ప్రశ్నించారు దాసోజు.