– బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా సత్యన్నారాయణ
విజయవాడ: ప్రజాసౌమ్య బద్దంగా, అంతర్గత ప్రజాసౌమ్యం పాటిస్తూ బీజేపీ ప్రతి మూడు సంవత్సరాలకొకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 30వ తేదీన నామినేషన్ స్వీకరణ, 30వ తేదీ సాయంత్రం లోపు ఉపసంహరణ, 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షులని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా సత్యన్నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు.
ఎన్నిక పీసీ మోహన్ కర్ణాటక ఎంపీ నేతృత్వం లో జరగనుందని, స్టేట్ కౌన్సిల్ మెంబెర్స్ ఓటర్లు ఉంటారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు, 8 మంది శాసన సభ్యులు, 5 గురు ఎంపీ లు, ఒక శాసన మండలి సభ్యులు ఎలక్షన్ జాబితాలో ఉంటారని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.