– 9 రోజులలో రైతు భరోసా పూర్తి చేస్తాము
– మంత్రి తుమ్మల
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వానాకాలం 2025 రైతు భరోసా నిధులను రైతు ఖాతాలలోకి జమ చేయడం ఆరంభించడం జరిగిందని మంత్రి తుమ్మల తెలియజేశారు. అందుకనుగుణంగా ఈ రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేయడం జరిగిందని, 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు గాను 2349.83 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజులలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి అన్నారు.