– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
జగ్గయ్యపేట: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో బైపాస్ రోడ్డులో గల బుద్ధుని విగ్రహం వద్ద చెరువులో గుర్రపు డెక్క పూడిక తీత పనులను స్థానిక నేతలు, అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను శాసన సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ అందరూ రోజువారి దినచర్యలో పడి ఆహ్లాదానికి దూరమైపోతున్నారు. అన్ని వర్గాల ప్రజల మానసిక వికాసానికి పర్యాటక రంగం ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది అన్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, మైనేని రాధాకృష్ణ, కన్నెబోయిన రామలక్ష్మి, కంచేటి గీతారాణి, గొట్టే నాగరాజు, నకిరకంటి వెంకట్, పేరం సైదేశ్వర రావు, ఇర్రి నరసింహారావు, సంగేపు బుజ్జి బాబు, గింజుపల్లి వెంకట్రావు, గుంజ ఏడుకొండలు, వేదులాపురి సైదా, కర్ల జోజి, పూసల పుల్లారావు, గాలం శ్రీను, షేక్ అక్బర్, షేక్ షరీఫ్, ఓర్సు వీరన్న, గింజుపల్లి కృష్ణ, కావేటి కృష్ణ, గంగదారి డేవిడ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.