Suryaa.co.in

Telangana

కేసీఆర్‌కు డీజీపీ అమ్ముడుపోయారు

– బీజేపీ ఎంపీ అర్వింద్ ఫైర్

తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన సీఎం కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. అయితే తెలంగాణ పోలీసు శాఖలో అలాంటి ముగ్గురు నలుగురు తప్ప, మిగిలిన వారంతా కేసీఆర్ సర్కారకు వ్యతిరేకంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. మహేందర్‌రెడ్డి లాంటి వారి వల్లే పోలీసుశాఖ పరువు పోతోందన్నారు.

‘ఆయన సీఎం కేసీఆర్‌కు చెంచాగిరి చేస్తున్నారు. నన్ను టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటే పోలీసుకమిషనర్లు ఏం చే స్తున్నారు? అధికార పార్టీకి నిబంధనలు వర్తించవా? వారిపై పోలీసులు కేసులు పెట్టరా? కేసీఆర్ తాగుబోతు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు తాగుబోతులు. ఇన్నాళ్లూ ఇంట్లో పడుకున్న కేసీఆర్ ఇప్పుడు నిద్ర లేచి జీఓ 317 తెచ్చాడు. భార్యాపిల్లల దగ్గరకు పోనీయకుండా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గం. మేం టీచర్ల పక్షాన పోరాడతాం’ అని అర్వింద్ స్పష్టం చేశారు.

నిజంగా 317 జీఓ రాజకీయ నేతలకూ వర్తింపచేస్తే హరీష్, కేటీఆర్ ఇప్పుడున్న నియోజకవర్గాలను వదలాలి. మరి వారికీ ఆ జీఓను వర్తింపచేసే ధైర్యం ఉందా? అని ఆయన నిలదీశారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసుల దాడి అనాగరికం, అప్రజాస్వామ్యమన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు గూండాల్లా వ్యవహరించార ని, ఈ ఘటనపై తాము కేంద్రానికి ఫిర్యాదు చేశామని అర్వింద్ చెప్పారు.

LEAVE A RESPONSE