Suryaa.co.in

Andhra Pradesh

ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ధర్మవరం

– అన్ని శాఖల సహకారం
– జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకూడదు
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

ధర్మవరం : అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం క్యాంప్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి చేపట్టవలసిన కార్యచరణ ప్రణాళికలపై సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయి, అధికారులతో మంత్రివర్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

డిఆర్డిపీడి నరసయ్య, DWMA PD, విజయేంద్రప్రసాద్, వాడు విజయేంద్ర ప్రసాద్, వార్డు సచివాలయం నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ మల్లికార్జునప్ప, ఆర్ అండ్ బి ఎస్ ఈ సంజీవయ్య, నేషనల్ హైవే అధికారులు, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఈ ఓ పి ఆర్ డి లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూసంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించడానికి ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉందని అందుకు సంబంధిత అధికారులు ప్రణాళిక రూపంలో నివేదికలు నాకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎక్కడెక్కడ తాగునీటి పైపులు లీకేజ్ ఉన్నాయో వాటిని గుర్తించి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదిన పనులు పూర్తిచేయాలని, అధికారులు ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని వాటిని సక్రమమైన మార్గంలో అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు చేరవేయడంలో మీ కృషి ఎక్కువగా ఉండాలని తెలిపారు, ఉపాధి పనులపై కూలీలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

15 ఫైనాన్స్ నిధులు ఇలా ఖర్చు పెడుతున్నారు? ఏ రంగాలకు ఎలా అమలు చేస్తున్నారు నివేదికల రూపంలో నాకు అందజేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో జల జీవన మిషన్ పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ధర్మవరం నియోజకవర్గంలో 4 మండలాలు మరియు 208 ఆవాసాలు ఉన్నాయి. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం సీపీడబ్ల్యూఎస్ పథకాలు, పీడబ్ల్యూఎస్ పథకం, చేతి పంపుల ద్వారా ఈ ఆవాసాలన్నింటికీ ప్రజలకు సురక్షిత నీరు అందజేయాలని తెలిపారు.

2024 నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి 55LPCDతో ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్ (FHTC) అందించడం లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE