– హంద్రీ నీవాకు టీడీపీ 5 ఏళ్లల్లో రూ.4,182 కోట్లు ఖర్చు
– జగన్ రెడ్డి మాత్రం రూ.515 కోట్లు ఖర్చు
– రాయలసీమలో జలవనరుల ప్రాజెక్టుల కోసం టీడీపీ 5 ఏళ్లల్లో చేసిన ఖర్చు రూ.8,291 కోట్లు
– జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లల్లో రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు
– మాజీ శాసనసభ్యులు బీ.సీ. జనార్ధన్ రెడ్డి
హంద్రీ నీవా సుజల స్రవంతికి టీడీపీ 5 ఏళ్లల్లో రూ.4,182 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి మాత్రం రూ.515 కోట్లు ఖర్చు చేసింది. కాని నేడు జగన్ రెడ్డి ప్రసంగంలో మాత్రం అంతా రాజశేఖర్ రెడ్డి పనులు చేసినట్లు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో చేసిన ఖర్చును తన తండ్రి చేసినట్లు చెప్పుకొని రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసుకొని దోచుకున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంకా పనులు పూర్తి కాకముందే నేడు డోన్ లో చెరువులో నీళ్లు నింపే కార్యక్రమానికి చేపట్టడం సిగ్గుచేటు. డోన్, పత్తికొండ, పాణ్యం, ఆలూరులో పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. పనులు పూర్తి చేయకుండానే, కొన్ని చోట్ల పైపు లైన్లు వేయకుండానే ప్రారంభోత్సవం చేయడం హేయం. నాశిరకం పనుల వలన 3 రోజుల క్రితం చేసిన ట్రయల్ రన్ లో పైపులు పగిలిపోయాయి. జగన్ రెడ్డి ప్రారంభోత్సవం చేసిన చెరువులు నింపేందుకు కనీసం మూడు నెలలైనా పడుతుంది. హంద్రీ నీవా కాలువకు ఎన్ని రోజుల నీళ్లు వస్తాయో తెలియకుండానే హడావుడి ప్రారంభోత్సవం చేశారు.
రాయలసీమలో కరువును నివారించేందుకు టీడీపీ విశేష కృషి చేసింది. 108 చెరువులకు హంద్రీ నీవా జలాలు ఎత్తిపోసి కరువు నివారణే లక్ష్యంగా పనులు చేసింది. అందుకు అనుగుణంగా 2018 అక్టోబర్ లో రూ.224.31 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే నెలలో శంకుస్థాపన చేసి 6 నెలల్లో రూ.65 కోట్లు ఖర్చు చేసి దాదాపు 35 శాతం పనులు పూర్తి చేసింది. కాని మిగిలిన పనులు పూర్తి చేయడానికి జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లు సమయం పట్టిందా?
రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్లల్లో రాయలసీమలో జలవనరుల ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు రూ.8,291 కోట్లు. కాని జగన్ రెడ్డి మాత్రం నాలుగున్నరేళ్లల్లో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రాయలసీమను రాళ్ల సీమగా మారుస్తున్నారు. జగన్ రెడ్డికి దమ్ముంటే ముందు హంద్రీ నీవా పనులు పూర్తి చేయాలి.