:సిఎస్ డా.సమీర్ శర్మ
అమరావతి,28 ఏప్రిల్:రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన జిల్లా పోలీస్ కంప్లయింట్ అధారిటీలకు సంబంధించిన వివిధ మౌలిక సదుపాయాల అంశంపై గురువారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మాట్లాడుతూ విజయవాడ, విశాఖపట్నం, తూర్పు గోదావరి,గుంటూరు,కర్నూలు జిల్లాల్లో జిల్లా పోలీస్ కంప్లయింట్ అధారిటీల ఏర్పాటుకు తగిన వసతి కల్పించాలని సిఎస్ దృష్టికి తెచ్చారు.దానిపై సిఎస్ డా.సమీర్ శర్మ స్పందించి సంబంధిత జిల్లా కలక్టర్లతో మాట్లాడి ఆయా కలక్టరేట్లలో రెండేసి రూములు వంతున వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ కార్యదర్శి అహ్మద్ బాబును ఆదేశించారు.
ఇంకా సిబ్బంది,వాహనాలు,ఫర్నిచర్ కల్పనకు ఆర్ధికశాఖ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించుకుని సకాలంలో వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుని త్వరితగతిన జిల్లా పోలీస్ కంప్లంయింట్ అధారిటీలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ను సిఎస్.డా.సమీర్ శర్మ ఆదేశించారు.