కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరవు భత్యం(డీఏ)ను 3శాతం పెంచింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు జులై 2021 నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28శాతం ఉండగా.. తాజా నిర్ణయంతో 31శాతానికి చేరింది. కేంద్ర నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70కోట్ల మేర అదనపు భారం పడనుంది. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై నుంచి దాన్ని పునరుద్ధరించడమే గాక.. 17శాతం ఉన్న డీఏను 28శాతానికి పెంచారు. ఇప్పుడు మరో 3శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Devotional
శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై…
ఇదే మహాభారత సారాంశం
లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం… తొమ్మిది వాక్యాలలో.. మీరు ఏ మతస్తులు అయినా, స్త్రీ లేక పురుషుడు అయినా, బీదా ధనిక అయినా ఏ ప్రాంతం వారైనా సరే.. ఆణిముత్యాలు వంటి ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు…
Sports
ముఖ్యమంత్రి సహాయనిధికి సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు సాత్విక్ తరఫున ఆయన తల్లిదండ్రులు టి రంగమణి ,ఆర్ కాశీ విశ్వనాథ్ గురువారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి…
స్వయంకృషి, పట్టుదలతో ఐసీసీ చైర్మన్ అయిన జే షా!
నిరుపేద కుటుంబంలో పుట్టిన జేషా, తిండి తిప్పలకోసం అష్ట కష్టాలు పడ్డారు. పలుకుబడి కలిగిన వారెవరితోనూ సంబంధం లేని వారు. అయినప్పటికీ అతని పూర్తి కృషి మరియు క్రికెట్ పట్ల మక్కువతో భారత క్రికెట్లోకి ప్రవేశించారు. అతని అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలతో, అనతికాలంలోనే బీసీసీఐ కార్యదర్శిగా నియమించబడ్డారు. ప్రపంచం అతని ప్రతిభను చూసి అతడిని చైర్మన్…