Suryaa.co.in

Telangana

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

– పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు, డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి. ఈ క్రమంలో డీజేలపై నిషేధం విధిస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

LEAVE A RESPONSE