జగన్ కు మానవత్వం ఉందా?

– అసలు మనిషైతే హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తారా?
– నారా చంద్రబాబు నాయుడు
వైసీపీ పాలనలో ఎన్నికల ప్రక్రియ ప్రసహనంగా మారింది, ‎దౌర్జన్యాలకు గత పంచాయితీ, ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి వైసీపీ గెలిచింది. ‎మెన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జ్యనాలు టీడీపీ నేతలు, కార్యకర్తలు దైర్యంగా ఎదుర్కోన్నారని, ఈ ఎన్నికల ఫలితాలే వైసీపీ పతనావస్తకు నాందని టీడీపీ జాతీయ అధ్యక్ష్యలు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో గురజాల నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో ఇటీవల జరిగిన దాచేపల్లి, గురజాల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగివుంటే గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీల్లో గెలిచేవాళ్లం, కానీ గెలిచి ఓడాం, వైసీపీ అధికారంలోకి వచ్చి నాటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో 8 మంది కార్యకర్తల్ని హతమార్చారు. అధికారం ఉందని మనుషుల్ని చంపుతారా? సీఎం కు మానవత్వం ఉంటే దీనికి సమాధానం చెప్పాలని ఎన్టీఆర్ భవన్ సాక్షిగా సవాల్ విసురుతున్నా? జగన్ కు మానవత్వం ఉందా? అసలు మనిషైతే హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తారా? సైదా అనే కార్యకర్తను నడిరోడ్డుపై కొట్టారు, అల్లాను ప్రార్దిస్తున్నా కనీసం జాలి చూపకుడా చితకబాదారు. గురజాల నియోజవకర్గంలో ‎ వైసీపీ నేతల అక్రమ మైనింగ్ వల్ల గుంతల్లో పడి 7 మంది చిన్నారులు చనిపోతే తిరిగి టీడీపీ వారిపై కేసులు పెడతారా? విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన వారికి రూ. కోటి ఇచ్చిన ప్రభుత్వం వైసీపీ నేతల అక్రమ మైనింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను ఎందుకు పట్టించుకోలేదు?
తురకపాలెంలో 70 వృద్ద ముస్లిం దంపతులపై హత్యయాత్నం కేసు పెట్టారంటే ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. పల్నాడులో వైసీపీ అరాచకాలు భరించలేక కుటుంబాలు, కుటుంబాలు వేరే ప్రాంతాల్లో తలదాచుకునే పరిస్థితి. టీడీపీ హయాంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే బాధితులకు అండగా నిలచి దోషుల్ని కఠినంగా శిక్షించాం. కానీ నేడు రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు.
వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు. నిత్యవసర ధరలు, పెట్రోల్, డీజిల్, ధరలు పెంచటంతో పాటు చెత్తపై పన్ను వేసిన ఏకైక తుగ్లక్ సీఎం దేశంలో జగన్ ఒక్కరే. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలను మోసం చేశారు. ఓటీఎస్ పేరుతో ప్రజల దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజల ఇళ్లపై మీ పెత్తనమేంటి? టీడీపీ ‍హయాంలో పేదలకు ఇళ్లు కట్టించాం,ఇప్పుడు మీరు కొత్తగా ఇళ్లు కట్టకపోగా గతంలో కట్టినవాటికి డబ్బులు వసూలు చేసే అధికారం ఎవరిచ్చారు? దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఓటీఎస్ డబ్బులు ఎవరు కట్టొద్దని ప్రజలకు విజ్నప్తి చేస్తున్నా టీడీపీ అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచితంగా అందరికి పట్టాలిస్తాం. రైతులకు గిట్టుబాటు ధరల్లు లేవు, రైతులకు ఇన్సూరెన్సు కట్టకుండా అబద్దాలు చెప్పారు, అసెంబ్లీలో మేం పోరాటం చేస్తే రాత్రికి రాత్రి ఇన్సూరెన్స్ కట్టారు. టీడీపీ ‍హయాంలో సకాలానికి ఇన్ పుట్ సబ్సిడి, ఎరువులు ఇచ్చాం. కానీ జగన్ రెడ్డి మాత్రం పన్నులు పెంచుతూ పేదలకు ఇచ్చే సంక్షేమ పధకాలు తగ్గిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి చేతకాని తనంతో వరదల వల్ల 30 మంది నిండు ప్రాణాలు పోయాయి. దీనికి కారణం జగన్ రెడ్డి కాదా?తిరుపతి, నెల్లూరు నగరాలు మునిగిపోయాయి. టీడీపీ ‍పాలనలో ఉచితంగా ఇసుక ఇస్తే నేడు ఇసుక అమ్ముకుంటున్నారు. నెల్లూరులో కరకట్ట తవ్వి ఇసుకను అమ్ముకుంటన్నారు. దీని వల్ల కరకట్ట తెగిపోయి ఆక్వా చెరువులు కొట్టుకుపోయి రూ. 200 కోట్ల నష్టం వచ్చింది. టీడీపీ ‍హయాంలో వరదల వల్ల నష్టపోయిన రైతులకు అన్ని విధాల న్యాయం చేశాం. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకుంది. పంట పూర్తి గా నష్టపోయిన వారి పరిహారం ఇవ్వడంతోపాటు బాధితులకు నిత్యవసర సరులకు అందజేశాం. కానీ నేడు వరదల సమయంలో జగన్ రెడ్డి ప్రజల్ని, రైతుల్ని గాలికొదిలారు. వరి పంట వేయెద్దని వ్యవసాయశాఖ మంత్రి అంటున్నారు.
మరి వరి పంట వేయకుండా గంజాయి పంట వేయమంటారా? రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తోంది, టీడీపీ కార్యకర్తలు, నాయకుల పైనే కాకుండా చివరకు ప్రజలపై కూడా దాడులు చేస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది అధికారులు తామేం చేసినా చెల్లుతుందన్నట్టు వ్యహరిస్తున్నారు. రేపు అధికారంలోకి వస్తాం, తప్పులు చేసిన వారు ఎక్కడున్నా వదలిపెట్టే ప్రసక్తేలేదు. రాష్ట్రంలో గంజాయి లేదని డీజీపీ చెబుతున్నారు.కానీ దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి, దీనికి సిగ్గుపడాలి. కమీషన్ల కోసం నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యం, మహిళల మంగళసూత్రాలతో చెలగాటమాడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు అమ్ముతున్నారు. డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ తీసుకుని సాయంత్రానికి పంపకాలు పంచుకుంటున్నారు. హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయని నాడు ఊరూరు తిరిగి చెప్పిన జగన్ నేడు హోదాపై ఎందుకు నోరు మెదపటం లేదు?
నాడు అమరావతి, పోలవరం రెండు కళ్లుగా అభివృద్ది చేస్తే నేడు నాశనం చేశారు –
నాడు రాష్ట్ర అభివృద్దికి అమరావతి, పోలవరం రెండు కళ్లుగా భావించి నిర్మాణానికి చర్యలు చేపట్టాం.‎ ప్రతిపక్షంలో ఉన్నపుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్ ఇప్పుడు 3 రాజధానులంటున్నారు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుని మళ్లీ బిల్లు తెస్తామని చెబుతూ తుగ్లక్ ని మించిన విధంగా ‎వ్యవహరిస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారు,
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రైతులకు కనీసం ఉండటానికి వసతి లేకుండా చేసి వాళ్లు రోడ్లపై భోజనం చేసే పరిస్థితి కల్పించారు. ఆడబిడ్డల్ని అవమానించినందుకు సిగ్గుగా లేదా? వారిని ఎందుకు వేధిస్తున్నారు? రాష్ట్రం కోసం తమ భూములు త్యాగం చేయటమే వారు చేసిన తప్పా? భూములిచ్చినందుకు రైతుల్ని వేధిస్తున్నారు, మరి జగన్, వైసీపీ నేతలు భూములిస్తారా? ముస్లిం, క్రిష్టియన్ మత పెద్దలు రైతులకు మద్దుతు తెలిపేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు.
నాడు ప్రతిసోమవారం పోలవరంగా మార్చి 74 శాతం పనులు పూర్తి చేశాం. ప్రాజెక్టుల కోసం రూ. 64 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశాం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. కానీ రెండున్నరేళ్లలో వీళ్లు పోలవరంలో చేసిన పనులు శూన్యం. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రి ప్రగల్బాలు పలికారు. మరి పూర్తి చేశారా? పోలవరం ప్రారంబోత్సవానికి వెళ్తామా? హైదాబాద్ కు దీటుగా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం, కానీ గ్రాఫిక్స్ అన్నారు, నాడు హైదాబాద్ అభివృద్ది చేశాం. అది గ్రాఫిక్సా ? ఇప్పుడు హైదారాబాద్ సిడ్నీ మాదిరి లేదా?
పంచాయితీనిధులు లాక్కుంటారా?
రాజ్యాంగం ద్వారా పంచాయితీలకు ఏర్పడిన హక్కుల్ని కాలరాస్తూ పంచాయితీ నిధులు సైతం లాక్కోవటం దుర్మార్గం. 14,15 ఆర్దిక సంఘం నిధుల్ని దారి మళ్లించారు. కానీ కేంద్రం దీన్ని తప్పు పడుతూ ఇక పంచాయితీలు సొంతగా ఖాతాలు తెరుకుంటే నిధులు ఇస్తామని చెప్పి జగన్ కు చెంపమీద కొట్టినట్టు చెప్పింది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు అబివృద్ది చేశాం, బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ వంటి వారు సైతం మన అభివృద్దిని మెచ్చుకున్నారంటే అది మన విశ్వనీయత, ప్రజల పట్ల మనకున్న చిత్తశుద్ది. వైసీపీ అరాచకాలు ప్రశ్నిస్తే అసెంబ్లీలో బూతులు తిడుతున్నారు.
వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నలబై ఏళ్ల రాజకీయం జీవితంలో ఎవరు వేలెత్తి చూపకుండా గౌరవంగా బ్రతికా.‎ కానీ నేడు నా భార్యను కించపరిచేలా మాట్లాడితే తట్టుకోలేకపోయా. నాపై 24 క్లైమోర్ బాంబులు పేల్చి చంపాలని చూసినా నేను భయపడలేదు. కానీ నేను ముఖ్యమంత్రినైనా, ప్రతిపక్షనేతనైనా నేను ఒక మనిషినే. ఇంట్లో మనుషుల్ని అంటే భాధ ఉండదా? అందుకే కౌరవ సభ నుంచి శపధం చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుని ముఖ్యమంత్రిగా అసెంబ్లీగా వస్తానని చెప్పా.
టీడీపీ హయాంలో అభివృద్దిలో నెం.1 గా ఉన్న ఏపీ నేడు, అప్పుల్లో, దోపిడిలో, నిత్యవసరధరల పెరుగుదలలో నెం. 1 స్ధానంలో ఉంది. చివరకు డ్వాక్రా మహిళలు సొమ్ము కూడా రూ. 2 వేల కోట్లు కాజేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటి నిధులు రూ. 400 కోట్లు లాక్కున్నారు. ముఖ్యమంత్రి చెప్పారు. నేను చేశానని వీసీ అంటున్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే సీఎంకు, వీసీకు శిక్ష తప్పదు. ఏపీ స్టేటపైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు, ఓటీఎస్ పేరుతో డబ్బులు కట్టమంటున్నారు. రేపు మీ పొలాలకు కూడా డబ్బులు కట్టాలంటారు. 70 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పులయితే జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని, కలెక్టర్ ఆపీసుల్నితాకట్టు పెడుతున్నారు. ? ఆ అధికారం మీకెవరిచ్చారు? వీటిని ప్రశ్నిస్తే టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. డీజీపీ ఆఫీసుకు అర కిలోమీటర్ దూరంలో ఉన్న టీడీపీ ఆఫీప్ పై దాడి జరిగితే స్సందిచని డీజీపీ రాష్ట్రాన్ని కాపాడుతారా?
వైసీపీ దాడుల్లో చనిపోయి కార్యకర్తల కుటుంబాలకు,‎ గాయపడ్డ వారికి పార్టీ తరపున ఆర్దిక సాయం
గురజాల నియో చనిపోయిన 8 మంది టీడీపీ కార్యకర్తలకు ఒక్కొరికి రూ. లక్ష, వైసీపీ నేతల దాడిలో గాయపడిన సైదాకు రూ. లక్ష, వైసీపీ అక్రమ మైనింగ్ గుంతల్లో పడి చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరి రూ. 50 వేలు చొప్పున పార్టీ తరపున ఆర్దిక సాయం ప్రకటించారు.
నాడు కేసులకు భయపడి ఉంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు. వైసీపీ అరాచాకాలు, దైర్యంగా ఎదుర్కోని వైసీపీ అరాచపాలనను నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి. వైసీపీ బాధితులకు అన్ని విధాల ఆదుకునే బాద్యత నాదే. ‎ రాష్ట్ర భవిష్యత్ కోసం చేస్తున్న దర్మపోరాటంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములవ్వాలని చంద్రబాబు నాయుడు పిలుపినిచ్చారు. పల్నాడులో వైసీపీ అరాచాకాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.