Suryaa.co.in

National

ప్రతిపక్షాలకు ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా?

-దర్యాప్తు సంస్థల ‘దుర్వినియోగం’పై పిటిషన్‌
-ప్రతిపక్షాలకు సుప్రీం షాక్‌
-విచారణ అర్హతపై ప్రధాన న్యాయమూర్తి అనుమానాలు

రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ , ఈడీ వంటి సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని కొంతకాలంగా ఆరోపిస్తున్న విపక్షాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్‌ను విచారిచేందుకు సర్వోన్నత న్యాయస్థానం) నిరాకరించింది. ఈ కేసులో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా సాధారణ మార్గదర్శకాలను రూపొందించడం ప్రమాదకరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకుని ఈడీ , సీబీఐ వంటి సంస్థలతో కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీలు ఆరోపించాయి.

అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌.. దీని విచారణ అర్హతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ”కేసుల దర్యాప్తులు, విచారణల నుంచి విపక్ష నేతలకు రక్షణ కల్పించేందుకు ఈ పిటిషన్‌ వేశారా? వారికి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా?” అని ప్రతిపక్షాల తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని సీజేఐ ప్రశ్నించారు.

LEAVE A RESPONSE