Suryaa.co.in

Andhra Pradesh

మీ బతుకును మేం గెలిపిస్తామని….

– వరద బాధితులకు ప్రముఖుల విరాళాలు
– కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్‌

ఉండవల్లి: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయనగరానికి చెందిన లెండి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ ఛైర్మన్ పి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు, గుంటూరుకు చెందిన తరుణి అసోసియేట్స్ ప్రతినిధులు రూ.5 లక్షలు, మంగళగిరికి చెందిన శిందే లక్ష్మయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు రూ.2 లక్షలు, గుంటూరుకు చెందిన అవినాష్ ఏజెన్సీస్ యాజమాన్యం రూ.2 లక్షలు అందజేశారు.

గన్నవరానికి చెందిన ఎంకే గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ నిర్వాహకులు రూ.లక్ష, ఆదోనికి చెందిన జి.కృష్ణమ్మ రూ.లక్ష, ఎంకే గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ప్రతినిధులు రూ.లక్ష, గుంటూరుకు చెందిన వడ్లమూడి సోమయ్య రూ.60,635, మంగళగిరి పెదవడ్లపూడికి చెందిన లూథరన్ చర్చ్ నిర్వాహకులు రూ.30వేలు, కుప్పంకు చెందిన పి.శివ కార్తీక్, పి.మురుగన్ రూ. 20 వేలు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సాయం అందించిన వారికి మంత్రి నారా లోకేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE