– కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా అమలయ్యే వరకు బీ ఆర్ ఎస్ పోరాడుతుంది
– శాసన మండలి లో ప్రతిపక్ష నేత ఎస్ .మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న ,బీ ఆర్ ఎస్ నేత పల్లె రవికుమార్
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడుగా వారం రోజులు కూడా కాని కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దమ్ముందా అని మాట్లాడడం తగదు.అన్ని పార్టీల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసింది. నిఖార్సయిన కాంగ్రెస్ వాది వీహెచ్ ను కాదని ఇతరుల్ని ముఖ్యమంత్రి చేశారు. బీ ఆర్ ఎస్ గురించి మాట్లాడడాన్ని ఖండిస్తున్నాం.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోంది. బీసీ డిక్లరేషన్ కోసం జరుగుతున్న పోరాటంతోనే, మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చింది.ప్రతి ఏటా బీసీలకు 20 వేల కోట్ల కేటాయింపు అని అందులో సగం కూడా కేటాయించలేదు. ఆర్థిక సంవత్సరం పూర్తయితే కాంగ్రెస్ బండారం బయటపడుతుంది.
దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ బీసీల గణన చేయలేదు.చరిత్రలో బీసీలను కేవలం ఓట్ల కోణంలోనే చూసిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరించింది. కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా అమలయ్యే వరకు బీ ఆర్ ఎస్ పోరాడుతుంది.
బీసీలను ఓటు బ్యాంకుగా చూడవద్దు. అన్యాయం చేసి ప్రతిఘటన ఎదుర్కోవద్దు. కేసీఆర్ హయాంలో బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. దేశంలో మెజార్టీ ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని, కేసీఆర్ 2004 లోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. రాజకీయంగా కూడా బీసీలకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారు.
తొలి ప్రభుత్వంలోనే రెండు చట్టసభల అత్యున్నత పదవులను బీసీలకు ఇచ్చిన నేత కేసీఆర్. పలుకుబడి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు సీఎం పై ఒత్తిడి తీసుకురావాలి.