భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కాంగ్రెస్ అనేకసార్లు అవమానించింది.1951లో హిందూకోడ్ బిల్లు, సామాజిక న్యాయం సాధికారత అంశాలపై అంబేద్కర్ అభిప్రాయాలతో నెహ్రూ విభేదించిన కారణంగా మనస్థాపం చెంది, అంబేద్కర్ కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
1952 లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో చేతులు కలిపి అంబేద్కర్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించింది. 1954 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అంబేద్కర్ ను ఓడించడానికి కాంగ్రెస్ స్వయంగా అభ్యర్థిని నిలబెట్టింది.
అంబేద్కర్‌ను చరిత్రలో ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు కాంగ్రెస్ నుండి కొనసాగాయి. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలోనే అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదు. అంబేద్కర్‌ను ఓడించిన అభ్యర్థి ఎన్.ఎస్. కజ్రోల్కర్‌కు 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వలేదు.
అంబేద్కర్ అంత్యక్రియలు దేశ రాజధాని ఢిల్లీలో జరగనీయకుండా మృతదేహాన్ని ముంబయికి తరలించారు.అంబేద్కర్ మృతదేహాన్ని పంపిన విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం వారి భార్యకు పంపించింది.
ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ద్రోహం
కాంగ్రెస్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలపై అనేక అఘాయిత్యాలు జరిగాయి. దళితులకు సంబంధించిన సమస్యలను కాంగ్రెస్ విస్మరించి, సామాజిక న్యాయాన్ని దూరం చేసింది.1961లో నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో రిజర్వేషన్లను “తక్కువ ప్రమాణాలకు దారితీసే చర్య”గా అభివర్ణించారు.
శ్రేణి ఆధారిత రిజర్వేషన్లను కాంగ్రెస్ బలహీన పరిచే విధంగా వ్యవహరించింది. ఇందిరా గాంధీ హయాంలో మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ఆలస్యం జరిగింది. 1985లో రాజీవ్ గాంధీ “రిజర్వేషన్లు మన సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తాయని” వ్యాఖ్యానించారు. 1990లో రాజీవ్ గాంధీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ లోక్‌సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలు
ఓబీసీ రిజర్వేషన్లను ప్రతిపాదించిన కాకా కలేల్కర్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ తిరస్కరించింది.రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేసింది.
రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ చర్యలు
జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ను కాంగ్రెస్ ప్రవేశపెట్టింది, దీనిని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ స్మృతి బిల్లును ఆమోదించడంలో కాంగ్రెస్ వైఫల్యం, మహిళా హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించింది.
పార్లమెంటు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను సాధించడంలో కాంగ్రెస్ ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులు, వెనుకబడిన వర్గాల హక్కులను విస్మరించి, ఓటు బ్యాంక్ రాజకీయాలను మాత్రమే ప్రోత్సహించింది.
బీజేపీ ప్రభుత్వం సేవలు (అంబేద్కర్ గౌరవార్థం)
బిజెపి, వాజ్ పేయి మద్దతుతోనే నాటి వీ.పి.సింగ్ ప్రభుత్వం అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ప్రదానం చేశారు.ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న రాష్ట్రీయ సమరసత దినంగా నిర్వహించాలని నిర్ణయించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం “పంచతీర్థాల అభివృద్ధి” ప్రాజెక్ట్ ద్వారా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తోంది.
జన్మభూమి – మహు, మధ్యప్రదేశ్
శిక్షాభూమి – లండన్ హౌజ్, లండన్
దీక్షాభూమి – భౌద్ధధర్మాన్ని స్వీకరించిన స్థలం, నాగ్ పూర్
మహాపరినిర్వాణ్ – దిల్లీలో అంబేద్కర్ నివాసం
చైత్యభూమి – అంత్యక్రియలు జరిగిన ప్రాంతం, ముంబై
రూ.200 కోట్లతో దిల్లీలో 26, అల్లీపూర్ రోడ్డులో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల.
అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 120 దేశాల్లో సామాజిక న్యాయం, సమరసత వేడుకలు నిర్వహించింది. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటం, సుప్రీంకోర్టు, న్యాయమంత్రిత్వ శాఖలో వారి విగ్రహం ఏర్పాటు చేసింది. రాజ్యాంగం అమోదం పొందిన నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నారు.
డిజిటల్ ఇండియాలో ఆర్థిక సేవల కోసం భీమ్ యాప్‌ను మోదీ ప్రారంభించి అంబేద్కర్ ఆర్థిక దార్శనికతకు గౌరవం కల్పించారు.
అంబేద్కర్ రాజ్యాంగ ఫలితంగా మహిళలకు సాధికారత కల్పించేందుకు 2023లో నారీ శక్తి వందన్ బిల్లు (33% రిజర్వేషన్లు) బీజేపీ ప్రవేశపెట్టింది. అధికరణ 370ని రద్దు చేసి, అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసింది.
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ పేరుతో అనేక పథకాలను అమలు చేసింది. జాతీయ బీసీ కమిషన్ కు బిజెపి రాజ్యాంగ బద్ధత కల్పించింది. మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువచ్చి, సామాజిక సమానత్వాన్ని నిశ్చితంగా కొనసాగిస్తుంది. అంబేద్కర్ ఆశయాల సాధనలో కాంగ్రెస్ విఫలమైందని చరిత్ర స్పష్టంగా చూపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు సమానత్వాన్ని మరియు న్యాయాన్ని అందించడంలో ముందు వరుసలో ఉంది.
-భరత్