హైదరాబాద్: డా..బిఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ఉ..10.30 గం..లకు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
సందర్బంగా నాయకులు మాట్లాడుతూ… ముందుగా అందరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత ప్రసంగిస్తూ సమాజంలో అసమానతలు రూపుమాపడానికి, అస్పృశ్యత నివారణకు ఆయన కంకణం కట్టుకొని కృషి చేశారు. అణగారిన వర్గాలకు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించిన మహోన్నత వ్యక్తి. ఈరోజు ఎంతోమంది ఆయన ఆదర్శాలు వల్లిస్తున్నారే తప్ప ఆచరణలో చేసింది శూన్యం.
స్వతంత్ర భారతంలో తొలి న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆరోజుల్లో డా. కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతిగా నియామకం జరిగినప్పుడు జాతీయ స్థాయిలో అతి కీలకమైన పాత్రను పోషించింది తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఒకటైన లోక్ సభ స్పీకర్ పదవికి దళితుడైన జిఎంసి బాలయోగిని, రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా దళిత మహిళ ప్రతిభా భారతి ని ఎంపిక చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు.
కార్యక్రమానికి కాసుల సుదర్సన్ శ్యామ్ సుందర్, భాను ప్రకాష్, కరణం కిరణ్, పరుశురామ్, బి.రాజు, సత్యనారాయణ, సుక్రవేది, యాదగిరి, శక్తి ప్రేమ్, పాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.