మచిలీపట్నంలో కానిస్టేబుల్ పై మందుబాబు దాడి

మచిలీపట్నంలో కానిస్టేబుల్ పై మందుబాబు దాడి. మద్యం సేవించి ఆకతాయిలు అల్లరి సృష్టిస్తున్నారంటూ డయల్ 100 కు కాల్. డయల్ 100 కు వచ్చిన ఫిర్యాదుపై స్పందించి అక్కడకు వెళ్లిన మచిలీపట్నం పోలీసులు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మద్దెల కృష్ణను మచిలీపట్నం పోలీస్స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మద్దెల కృష్ణ. మద్దెల కృష్ణకు పోలీసులకు మధ్య తోపులాట. ఆగ్రహంతో ఇటుక రాయి తీసుకుని కానీస్టేబుల్ శ్రీనివాస్ తలపై బాదిన కృష్ణ.జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసవిషయం తెలుసుకొని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన స్టేషన్ సిబ్బంది. జరిగిన సంఘటన పై ఆరా తీసిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్. దాడికి పాల్పడిన కృష్ణను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ ఆదేశించిన ఎస్పీ సిద్ధార్థ. ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణను అదుపులోకి తీసుకున్న మచిలీపట్నం పోలీసులు.