Suryaa.co.in

National

సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్

– కాంగ్రెస్‌కు ఎన్డీఏ ఝలక్

ఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్లను ప్రస్తావించింది. అలాగే, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా, సుమన్‌ దూబేతో సహా అనేక మంది పేర్లను పేర్కొంది.

ఈ వ్యవహారంపై ఈ నెల 25న ప్రత్యేక కోర్టు విచారణ నిర్వహించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. కాగా, హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే చార్జిషీట్‌ దాఖలు చేయడం గమనార్హం. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా, సుమన్‌ దూబేతో సహా అనేక మంది పేర్లను పేర్కొంది.

LEAVE A RESPONSE