Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పాలనలో గాల్లో దీపంలా విద్యావ్యవస్థ

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్ పీసులు-డస్టర్లు లేని స్కూల్స్, అద్దె చెల్లించలేదని కాలేజీలకు తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు. పాఠశాలలు ప్రారంభమయి నెలలు గడుస్తున్నా గ్రాంట్స్ విడుదల చెయ్యకపోవడం సిగ్గుచేటు. విద్యా శాఖకు మంత్రి లేడు..శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి దిక్కు లేడు. పదుల సంఖ్యలో ఢిల్లీకి చెక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి మీ సొంత నియోజకవర్గంలో అధ్యాపకులు లేక విద్యార్థులు టీసీలు తీస్కొని వెళ్లిపోతున్నారు.తక్షణం విద్యా శాఖ పై ఉన్నత స్థాయి సమీక్ష జరిపి సమస్యలు పై ద్రుష్టి పెట్టండి-పిల్లల బంగారు భవిష్యత్ తో చెలగాటం వద్దు.

LEAVE A RESPONSE