విజయవాడ: స్వాతంత్ర్య భారత దేశం లో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితిని విధించింది. గత పాలకులు దేశంలో చేసిన అరాచకాలని బ్లూ కార్ట్ సంస్థ వారు మంచి పుస్తకాన్ని రచించారు.
50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ చేసిన అత్యంత దారుణానికి నిదర్శనంగా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బ్లూ కార్ట్ సంస్థ డైరీ లో అంశాలు పొందుపరిచారు అత్యవసర పరిస్థితి డైరీ వల్ల ఈ తరానికి తెలియాల్సిన మంచి అంశాలు పొందుపరిచారని ఎంపీ పాకా సత్యనారాయణ కితాబు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ కార్యక్రమం రాష్ట్ర ఇంఛార్జి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.