టీఎస్ఎంఎస్ ఐడీసీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్..

Spread the love

– కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉద్యమ కారుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లాకు ఈ అవకాశం ఇవ్వడం సంతోషకరం..ఇంతకు మునుపు తన దైన శైలిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు.

అదే రీతిలో ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ. అలాంటి సంస్థకు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు నా అభినందనలు.సాధారణంగా మనకు ప్రభుత్వ ఆస్పత్రులలో బిల్డింగ్ లు, మెడికల్ డివైసెస్, ఎక్స్ రేలు, టెస్టింగ్ ల్యాబ్ లు, ఇంజక్షన్లు, బెడ్లు మాత్రమే ఆస్పత్రుల్లో కనిపిస్తాయి. కాని అవి సమకూరడానికి శ్రమించేది, సమకూర్చేది టీఎస్ఎంఎస్ఐడీసీ సంస్థనే.ఆస్పత్రుల భవన నిర్మాణా పనులు, అవసరమైన ఫర్నిచర్, మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, వైద్యానికి అవసరమైన కాటన్, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ, శానిటైజెషన్, ఆస్పత్రుల భద్రతకు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాట్లు, వైద్యో ఆరోగ్య శాఖకు అవసమరైన అన్ని సదుపాయాలు కల్పించేది ఈ సంస్థ ద్వారానే. ఒక్క మాటలో చెప్పాలంటే సూది నుండి సీటీ స్కాన్ మిషన్ వరకు సమకూర్చేది ఈ సంస్థే.

మహబూబ్ నగర్,సిద్దిపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్మించింది.
సిరిసిల్లలో నర్సింగ్ కాలేజీని నిర్మించింది. ఎం.ఎన్. జే క్యాన్సర్ ఆసుపత్రిలో మాడ్యులర్ ధియెటర్ నిర్మాణ పనులు ఈసంస్థ ద్వారానే జరుగుతున్నాయి.తెలంగాణ వైద్య విధాన పరిషత్తు కు సంబంధించిన 14 ఆస్పత్రుల అప్ గ్రేడేషన్, 83 ఆస్పత్రులను బలోపేతం చేయడం లో ఈ టీఎస్ఎంఎస్ఐడీసీ కీలకంగా పని చేసింది.19 హబ్ అండ్ స్పోక్ మోడల్ డయాగ్నోస్టిక్ సేవలు అందించే కేంద్రాలు, 8 మినీ హబ్ లను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది.

ఇక కరోనా సమయంలో దేశంలోనే కరోనా టెస్ట్ కిట్స్, పీపీఈ కిట్స్, ఆక్సిజన్ , కరోనా మందులు, రెమిడెసివర్ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఎస్ఎంఎస్ ఐడీసీ సంస్థ ఎంతో చాకచక్యంగా వాటిని సేకరించి ఎంతో మంది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడడంలో కీలకంగా వ్యవహరించింది. బ్లాక్ ఫంగస్ కి కూడా మనం మందులు సరఫరా చేశాం. ఎంతో మంది వ్యాధిగ్రస్థులకు సేవలందించి కాపాడుకున్నాం.

ఆసుప‌త్రుల్లో అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌ను ప్ర‌భుత్వం స‌మ‌కూర్చుతున్న‌ది. మొత్తం రూ. 150 కోట్ల‌తో వివిధ ఆసుప‌త్రుల్లో అత్యాధునిక సిటీ, ఎంఆర్ఐ, పిఇటి స్కాన్ మిష‌న్ల‌ను ఏర్పాటు చేసింది. గుండె స‌మ‌స్య‌లున్న వారిని కాపాడుకునేందుకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, ఎంజీఎంల‌లో, ఖ‌మ్మం, ఆదిలాబాద్ ఆసుప‌త్రుల్లో విలువైన క్యాథ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం. టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా వీట‌న్నింటిని స‌మ‌కూర్చుకుంటున్నాం.

ఆరోగ్య తెలంగాణ గా తెలంగాణ రాష్ట్రం మారాలన్నది సీఎం కేసీఆర్ కల. పేషంట్లకు త్వరిత గతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద ఉంది. తను చురుకుగా ఉండి, తన సంస్థను మరింత ముందుకు సమర్థవంతంగా నడుపుతూ, వందకు వంద శాతం తన బాధ్యతలను నిర్వర్తించి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను.

Leave a Reply