Suryaa.co.in

Telangana

కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయండి

– వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌: కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలి.. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలి. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం. ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలి.

వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలి. వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలి. తక్షణమే కేంద్ర సాయం కోరుతు లేఖ .. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు లేఖ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతు ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాయాలని సీఎం అధికారులకు సూచించారు.

ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. వర్షాల సమయంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలి… వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలి… విద్యుత్ సరఫరా లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

LEAVE A RESPONSE