నరసరవుపేట పార్లమెంటు ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాల స్థాపన

– నాణ్యమైన విద్యాభివృద్ధికి జీవీఎల్ కృషి
రాజ్య సభ సభ్యులు, రాష్ట్ర DISHA కమిటీ కేంద్ర ప్రతినిధి జీవీవీల్ నరసింహా రావు పార్లమెంట్ నందు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసరావుపేట (రొంపిచెర్లలో) అసెంబ్లీ నియోజక వర్గంలో కేంద్రీయ విద్యాలయ (స్కూల్) స్థాపనకు జరుగుతున్న ఆలస్యానికి గల కారణం ప్రశ్నించినపుడు మంత్రిత్వ శాఖ సమాద్గానమిస్తూ రొంపిచర్ల నందు KV ప్రారంభానికి అవసరమైన చర్యలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నవని, ప్రతిపాదించబడిన 5 ఎకరాల స్థలం విషయం లో కొన్ని సమస్యలు ఉన్నవని ఆ ప్రాంతం పూర్తిగా లోతట్టు ప్రాంతంలో ఉండటం వలన దానిని మెరక చేయవలసి ఉన్నదని కేంద్రీయ విద్యాలయం సంస్థ, గుంటూరు జిల్లా కలెక్టర్ కి తెలియచేయటం జరిగిందని తెలియ చేస్తూ,నరసరావుపేట పార్లమెంటు లో మాచర్ల ప్రాంతంలో మరో కేంద్రీయ విద్యాలయ స్థాపనకు ప్రతిపాదన ఉన్నది అని జీవీఎల్ మరో ప్రశ్నకు సమాధానంగా తెలియ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి కేంద్రీయ విద్యాలయాల స్థాపనకు అవసరమైన స్థలాల అందజేతలో జరిగిన ఈ ఆలస్యంపై రాజ్య సభ సభ్యులు కేంద్ర DISHA ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు స్పందిస్తూ తాను నరసరావుపేట పార్లమెంటు-పల్నాడు ప్రాంత అభివృద్ధికై అనేక కేంద్ర పధకాల ద్వారా, కేంద్ర సంస్థల స్థాపన ద్వారా వ్యక్తిగతంగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికీ , రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, అలసత్వం, ప్రజా ప్రయోజనాల పట్ల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి అనుకున్నంత వేగంగా జరగటం లేదని , అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ DISHA కమిటీ లో కేంద్ర ప్రతినిధిగా వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వ DISHA సమావేశాలలో చర్చించి తగిన పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని తెలియ చేశారు .

Leave a Reply