– హైడ్రా బూచి చూపి బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి హైకమాండ్ కి డబ్బులు పంపడానికి
– రుణమాఫీ చేయకుంటే నీ భరతం పట్టుడు ఖాయం
– రైతు హామీల సాధన సదస్సులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
రేవంత్ రెడ్డి అధికారం నెత్తికి ఎక్కి ఎవరినీ లెక్కజేయని స్థాయికి ఎదిగిండు. కేసీఆర్ కి 6 ఏళ్లు పడితే.. రేవంత్ కి మూడు నెలలే పట్టింది. మోసానికి దగాకు మారుపేరు రేవంత్. రెండింటి కోసం రేవంత్ ఇదంతా చేస్తున్నాడు. హైడ్రా బూచి చూపి బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి హైకమాండ్ కి డబ్బులు పంపడానికి. మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లలో వచ్చే కమీషన్ కోసం.
హైకోర్టు హైడ్రాపై స్పందించింది. ఈరోజు శుభదినం. హైకోర్టు తప్పు పట్టింది అధికారులను కాదు రేవంత్ రెడ్డిని. రేవంత్ నీకు రేషం ఉంటే దిగిపో..
మూసీ, హైడ్రా బాధితులకు మేము అండగా ఉంటాం. హామీల మీద రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఇప్పటివరకు ఎంత రుణమాఫీ అయ్యిందో పబ్లిక్ పోర్ట్లలో పెట్టాలని డిమాండ్ చేస్తున్న.రుణమాఫీ చేయకుంటే నీ భరతం పట్టుడు ఖాయం. పేదల కన్నీళ్ళలో కాంగ్రెస్ కొట్టుకుపోతుంది బీ కేర్ ఫుల్.
మోసానికి, దగాకు మారుపేరు రేవంత్ . రాహుల్ గాంధీని కూడా బోల్తా కొట్టించారు. కేసీఆర్ కూడా అలవికాని హామీ ఇచ్చారు. అడ్రస్ లేకుండా పోయారు.రుణమాఫీ చేస్తా అంటే.. రేవంత్ ను నమ్మి రైతులు ఓట్లు వేశారు. కేసీఆర్ ను ఓడించాలని ప్రజలు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఆరు గ్యారంటీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏమీ అమలు కాలేదు. 17900 కోట్లు రుణమాఫీ చేశామని సిఎం కార్యాలయం ప్రకటించింది తప్ప ఎక్కడా లెక్కలు చెప్పలేదు. దమ్ముంటే ఎంత అయ్యిందో లెక్కలతో సహా ప్రజా పోర్టల్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్న.
బిజెపి, మోడీ మాట ఇస్తే తప్పరు. ఎరువుల కోసం లైన్లు కట్టే దౌర్భాగ్య స్థితి లేకుండా… కాంగ్రెస్ మూసేసిన రామగుండం ఎరువల ఫ్యాక్టరీని 6300 కోట్లతో ప్రారంభించి తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా చేసిన మహనీయుడు మోదీ. దేశవ్యాప్తంగా రైతులకు 6 వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం బీజేపీ.
మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకొనే ముందు ప్రజాప్రతినిధులను సంప్రదించావా ? క్యాబినెట్ లో చర్చించావా ? MLA లకు చెప్పావా ? ఈయన్ను చూస్తే పేదల ఇళ్లను కూల్చి పేదల ఉసురు పోసుకున్న సంజయ్ గాంధీ గుర్తుకు వచ్చాడు. ఆయన వారసుడు ఈయన. హుస్సేన్ సాగర్ జలవిహార్, ప్రసాద్ imax, ప్యారడైజ్ ఎవరు కట్టారు. అవి వదిలిపెట్టి పేదల కొంపలు కూల్చే అధికారం నీకు ఎవడు ఇచ్చాడు. రెండింటి కోసం రేవంత్ ఇదంతా చేస్తున్నాడు. బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి హైకమాండ్ కి డబ్బులు పంపడానికి. మూసీ ప్రక్షాళన కాదు లక్షన్నర కోట్లలో వచ్చే కమీషన్ కోసం.