ప్రాణాప్రాయంలో ఉన్న వ్యక్తిని కాపాడటంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

– గుండెపోటుకు గురై వారిని ఎలా కాపాడాలన్న అంశంపై టీడీపీ జాతీయ కార్యాలయంలో అవగాహన సదస్సు

ప్రాణాపాయంలో ఉన్న వారిని ఎలా కాపాడాలన్న అంశంపై సమాజంలోని ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని డా. సాయి కృష్ణ అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాలతో,

డా.లోకేశ్వరరావు సూచనలతో టీడీపీ జాతీయ కార్యాలయంలో ప్రొవెన్సియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గుండెపోటుకు గురైన వ్యక్తుల్ని ఎలా కాపాడాలి అన్న అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. సాయికృష్ణ మాట్లాడుతూ….ప్రస్తుత మారిన జీవన శైలి, పలు అనారోగ్య సమస్యల వల్ల అనేక మంది గుండెపోటుకు గురై మరణిస్తున్నారని అన్నారు. గుండెపోటు రావడానికి గల కారణాలు,
tdp-office గుండెపోటు ముందు వచ్చే లక్షణాలను వివరించారు. దీనిపై అవగాహన ఉంటే సాటి వ్యక్తి ప్రాణాలు కాపాడగలమని అన్నారు.‎ అనంతరం గుండెపోటు వచ్చిన వారిని ప్రాధమికంగా ఎలా కాపాడాలో ప్రాక్టికల్ గా వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రొవెన్సియా సంస్ధ సభ్యులు డా. అప్పారావు, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పర్చురి అశోక్ బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యధ్ రఫీ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, ఎన్.ఆర్.ఐ కో ఆర్డినేటర్ రాజశేఖర్, హసన్ బాషా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply