వినూత్నమైన పరిశోధనలతో… ఎన్నో సృజనాత్మక ఆవిష్కరణలు చేపట్టిన కె ఎల్ యూనివర్సిటీ విద్యార్థులు… సరికొత్త పరిజ్ఞానం, ఆలోచనలతో శాటిలైట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కె ఎల్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన 34 మంది విద్యార్థులు రూపొందించిన 3 రకాల శాటిలైట్స్ ను అక్టోబర్ 18 శనివారం ఉదయం 5:30 నుంచి 8 గంటల మధ్యలో ప్రయోగించునున్నారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలను విజయవంతంగా నిర్వహించి భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో గొప్ప ఖ్యాతిని పొందింది..అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ రంగాల్లో ఇంకా పరిశోధనలు జరుగుతూనేన్నాయి.
కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ సొంత టెక్నాలజీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిన్న తరహా ఉపగ్రహ ప్రయోగం చేయబోతున్నామని వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
భూమినుండి సుమారు 12-13 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ 800 కిలోమాటర్ల దూరం ప్రయాణిస్తూ వాతావరణంలో వస్తున్న మార్పులను స్ట్రాటోస్పిరిక్ పరిశోధన, టెలిమెట్రీ పరీక్ష ఎప్పటికప్పుడూ పర్వవేక్షిస్తూ పరిశోధనలు చేయడానికి కెఎల్ శాట్ పేరుతో చిన్న ఉపగ్రహాన్ని ఆకాశంలోకి పంపడానికి అన్ని రకాల అనుమతులు తమకు వచ్చాయన్నారు. లాంచ్ ఫ్యాడ్ గా గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్ లోని క్రికెట్ మైదానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం రెండవ సారి చిన్న తరహా ఉపగ్రహాన్ని కెఎల్ శాట్ ద్వారా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ సిద్దమయ్యాయన్నారు. అందుకోసం వర్శిటీలోని ఆయా విబాగాధిపతులతో పాటు అధ్యాపకులు తమకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తాము రూపొందించిన చిన్న తరహా ఉపగ్రహాన్ని వాతావరణ కొలత, సాంకేతికతలో ఒక స్మారక పురోగతిని సూచిస్తుందన్నారు. ఈ మిషన్ భూమి యొక్క పర్యావరణం, మన వాతావరణం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. ఈ మిషన్ కు పూర్వ డైరెక్టర్, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా పూర్వ డాక్టర్ కె.శరత్ కుమార్ వ్యవహరిస్తుండగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ప్రొఫెసర్ పూర్వవిద్యార్దుల విభాగ డైరెక్టర్ డాక్టర్ కె.సిహెచ్. శ్రీ కావ్య వ్యవహరిస్తున్నారని తెలిపారు.
వీరిద్దరు తమ ఇసిఇ విభాగానికి చెందిన విద్యార్దులతో కలిసి రూపొందించారు. ఈ మిషన్ ద్వారా వాతావరణ కొలత సాంకేతికతపై మన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. కీలకమైన డేటాను సంగ్రహించడానికి, ప్రసారం చేయడానికి సజావుగా కలిసి పని చేసే ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన భాగాల సంక్లిష్ట వ్యవస్థను ఉపయోగిస్తుందన్నారు. ఈ మిషన్ భూమి యొక్క వాతావరణం యొక్క రహస్యాలను అన్వేషించడంతో పాటు సంచలనాత్మక శాస్త్రీయ పరిశోధనలకు దోహద పడుతుందన్నారు.
1- పికో బెలూన్‌తో కూడిన కెఎల్ జాక్ లైట్ వెయిట్ శాటిలైట్, కాన్‌శాట్ డెమోన్స్ట్రేషన్ (ఎ 4యు మాడ్యూల్),
2- హైబ్రిడ్ డ్రోన్-కమ్-ఫ్లైట్ మాడ్యూల్తో కెఎల్ శాట్ 2 పేలోడ్:- బహుళ పర్యావరణ, కమ్యూనికేషన్ సెన్సార్లతో 2యు క్యూబ్‌శాట్ (20 సెం.మీ ఎత్తు,10 సెం.మీ పొడవు, 10 సెం.మీ వెడల్పు కలిగి ఉంటుంది. అంచనా వేసిన ఎత్తు: యుఎవిఎపి మోడ్‌లో 1–2 కి.మీ. క్షితిజ సమాంతర పరిధి: 70-80 కిలో మీటర్ల దూరం ప్రీమ్యాప్ చేయబడింది. లక్ష్యం: డ్రోన్-సహాయక క్యూబ్‌శాట్ విస్తరణ యొక్క డేటా సేకరణ, ధ్రువీకరణ. కెఎల్ శాట్-2 (యుఎవిఎపి ని ఉపయోగించి ఎ 2యు క్యూబ్‌శాట్ ను ఖచ్చితమైన ప్రణాళిక, రూపకల్పన చేశారన్నారు.
హై ఆల్టిట్యూడ్ బెలూన్ (హెచ్ఎబి) ద్వారా ప్రారంభించటానికి మాడ్యూల్, సాఫ్ట్ వేర్ కోడింగ్, హార్డ్ వేర్ ఇంటిగ్రేషన్, అసెంబ్లీ, టెస్టింగ్ మరియు ఫైనల్ మాడ్యూల్ తయారీలో మొత్తం 34 మంది ఇసిఇ విద్యార్థులతో పాటు ఒక మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి కలిసి గత 6 నెలల పాటు శ్రమించి ఈ ఉపగ్రహానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఉప గ్రహం స్వదేశీయంగా తయారు చేయబడిన స్పేస్ శాట్ ట్రాకర్ ఒక కీలకమైన అంశమన్నారు.
ఇది 35కిలోమీటర్ల ఎత్తు వరకు వెళుతుందన్నారు. క్యూబ్ శాట్ మాడ్యూల్ యొక్క నిజ-సమయ ట్రాకింగ్‌ను నిర్ధారిస్తుందన్నారు . కెఎల్ శాట్ -2 ప్రారంభం అక్టోబరు 18 – 2025న, ఉదయం 05:30 గంటలకు, కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ క్రికెట్ మైదానం నుండి ఎటిసి గన్నవరం పర్యవేక్షణలో షెడ్యూల్ చేయబడిందన్నారు. ఎటిసి విజయవాడ విమానాశ్రయం విజయవాడ, చెన్నైలోని ఎటిఎస్ కార్యాలయాల నుండి నిరంతర సమన్వయం చేసుకుని అన్ని రకాల అనుమతులను ఉన్నతాధికారుల నుండి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ మిషన్ ద్వారా వాతావరణ కొలత సాంకేతికతపై మన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. కీలకమైన డేటాను సంగ్రహించడానికి, ప్రసారం చేయడానికి సజావుగా కలిసి పని చేసే ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన భాగాల సంక్లిష్ట వ్యవస్థను ఉపయోగిస్తుందన్నారు. ఈ మిషన్ భూమి యొక్క వాతావరణం యొక్క రహస్యాలను అన్వేషించడంతో పాటు సంచలనాత్మక శాస్త్రీయ పరిశోధనలకు దోహద పడుతుందన్నారు.
ఈ మిషన్ ఒక క్లిష్టమైన పొర ఆన్-బోర్డ్ కంప్యూటర్ (సెన్సార్స్) లేయర్, క్లిష్టమైన పర్యావరణ డేటాను సంగ్రహించడానికి బాధ్యత వహిస్తుందన్నారు. ఇది వాతావరణ పీడనాన్ని కొలిచే వివిధ రకాల సెన్సార్లను కలిగి ఉందన్నారు. కార్బన్ మోనాక్సైడ్ మరియు మీథేన్ వంటి వివిధ వాయువులను గుర్తించడం, ఖచ్చితమైన చలనం, ధోరణిని ట్రాక్ చేయడం, ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం, ఓజోన్ స్థాయిలను గుర్తించడానికి అంతరిక్షంలోకి వెళ్లడమని పేర్కొన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరాను నిర్ధారించడం అనేది బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (బిఎస్ఎం) లేయర్, ఇది మిషన్-క్లిష్టమైన భాగం. ఈ లేయర్లో సౌర ఫలకాలు మరియు లిథియం-అయాన్ బ్యాటరీలు వంటి విద్యుత్ సరఫరా భాగాలు ఉంటాయన్నారు.
ఈ మొత్తం ప్రాజెక్ట్ కు కెఎల్ఇఎఫ్ చైర్మన్ కోనేరు సత్యనారాయణ సగర్వంగా నిధులు సమకూర్చారని తెలిపారు. ఈ సందర్బంగా ఉపగ్రహానికి రూపకల్పన చేసిన బృంద సభ్యులను, విద్యార్దులను వర్శిటీ చైర్మన్ కోనేరు సత్యన్నారాయణ , వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, పరిశోధన, అభివృద్ది డీన్ డాక్టర్ బిటిపి.మాధవ్, అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు పాల్గొంటారు.