Suryaa.co.in

Andhra Pradesh

అంకెల గారడీతో బుగ్గన బడాయి కబుర్లు – సంక్షేమంపై చెప్పేవన్నీ అబద్ధాలే !

– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాళెం విజయకుమార్

ప్రభుత్వ ఆదాయాన్ని లిక్కర్‌పై పెంచిన ధరలతో పెంచుకొన్నారు. స్వంత ఆదాయంలో 20 శాతం లిక్కర్ మీద తెచ్చుకొనే స్థాయికి వచ్చారు. నాలుగున్నరేళ్లలో 65 నుంచి 70 వేల కోట్ల మద్యం ఆదాయాన్ని సాధించారు. కానీ, 9.39 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఇప్పటి వరకు సంక్షేమం మీద ఖర్చు పెట్టింది కేవలం 1.53 లక్షల కోట్లు మాత్రమే. తెలుగుదేశం హయాంలో 7.08 లక్షల కోట్ల బడ్జెట్‌లో 1.30 లక్షల కోట్లు సంక్షేమంపై ఖర్చు పెడితే, ఏడాదికి 2 లక్షల కోట్లు బడ్జెట్ వుండి మీరు అదనంగా సంక్షేమంపై పెట్టిన ఖర్చు 20 వేల కోట్లే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సొంత కాళ్ళపై నిలబడే సబ్‌ప్లాన్ నిధులను ఈ నాలుగున్నరేళ్లలో రూ. లక్షా 14 వేల కోట్లు దారి మళ్ళించి సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటారా?

బుగ్గన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందంటారు. కానీ అప్పులు ఆకాశాన్ని చేరుతుంటాయి. యనమల రామకృష్ణుడి గారి లేఖకు జవాబుగా మొన్నటి ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో ప్రభుత్వ ఆర్ధికపరిస్థితి మొదట బాగుందని అన్నారు. తర్వాతా అబ్బెబే… బాగుందంటే బాగుందని కాదు… కష్టాల్లో ఉన్నాం అని తడబడ్డారు. ఇంతకూ ఈ రోజు మీ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగుందా … బాగోలేదా?

ఆర్ధికంగా వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కన్న బాగుందని అంటారు ఒకసారి…కానీ అప్పులు, పన్నులు గురించి మాట్లాడరు. మళ్ళీ ఆర్ధిక పరిస్థితి బాగోలేదని తడబడతారు..! తెలుగు దేశం హయాంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి తప్పుడు అంకెలు ఇచ్చారు. స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో గానీ..కనీసం CAG అంకెలు అయినా రెఫెర్ చేసుంటే బాగుండేది. అప్పులు చేస్తారు. ఆర్ధికంగా సూపర్ అంటారు. GSDP పెరిగిందని అంటారు.

కానీ రాష్ట్ర స్వంత రాబడులు దానికి అనుగుణంగా కనిపించదు. కొత్త పరిశ్రమలు కనిపించవు, వరి దిగుబడి తగ్గుతోంది, సాగు భూమి తగ్గుతోంది, జీఎస్టీ పెరుగదు. కానీ గ్రోత్ రేటు మాత్రం పెరిగిపోతుంది. పైగా తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రోత్ రేటు 6 శాతమేనని బుకాయిస్తారు. వైసీపీ ప్రభుత్వం పరిమితికి లోబడే అప్పులు చేసామని అంటారు. CAG నివేదికలు మాత్రం మీరు రాజ్యాంగ విరుద్ధంగా ఎక్కువ అప్పులు చేసారని చెప్తుంది.

అసలు రాష్ట్ర ఆదాయం నిజంగా పెరిగిందా అంటే, మీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఆదాయంలో వృద్ధి రేటు తెలుగుదేశం కంటే తక్కువ వుంది. రాష్ట్రం పనితనాన్ని చూపించేది – “ రాష్ట్రం యొక్క స్వంత ఆదాయం”. ఈ పద్దులోనే , రాష్ట్రం వేసే పన్నులు, లిక్కర్, రిజిస్ట్రేషన్లు అన్నీ వుంటాయి. గత పదేళ్ళలో తెలుగుదేశం VS వైసీపీ ప్రభుత్వాల “ రాష్ట్ర స్వంత ఆదాయాలను” చూస్తే విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా, మొదటి సంవత్సరం 29,857 కోట్లు రాష్ట్ర స్వంత ఆదాయం వుండగా, 2019 నాటికి 58,031 కోట్ల స్వంత ఆదాయాన్ని సాధించాము. అంటే, 2014 ఆడాయానికంటే, రాష్ట్రం తాను స్వంతంగా సంపాదించుకొన్న ఆదాయం “98 శాతం వృద్ధి” చెందింది. మొత్తం పన్ను ఆదాయంలో 119 శాతం సాధించింది.

2019-23 సెప్టంబర్ దాకా వైసీప్ ప్రభుత్వ స్వంత ఆదాయ వృద్ధి ఎంతో తెలుసా? 2019-20లో 85,843 కోట్లతో మొదలు పెట్టి , 2023 నాటికి 1,16,202 కోట్లకు చేరింది. అంటే, స్వంత ఆదాయంలో YCP ప్రభుత్వంలో కేవలం 54% వృద్ధి (TDP 98%). మొత్తం పన్ను ఆదాయంలో YCP వృద్ధి కేవలం 35.5 శాతం (TDP హయాంలో 119%) తగ్గుదలకి వైసీపీ తరచూ చెప్పే ‘కోవిడ్’ కారణం పూర్తిగా నిజం కాదు. కోవిడ్ 2020-21లో ఆంధ్రలో వృద్ధి మైనస్ లోకి పోలేదు. 1% ప్లస్ లో వుంది.

వృద్ధి రేటు ఏముంది, టీడీపీ హయాం కంటే మేము ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక లక్ష కోట్లు అదనంగా సంపాదించామని అంటారేమో బుగ్గనగారు. నిజమే…మా ఆదాయం రూ. 2,21,462 కోట్లు అయితే, వైసీపీ ఆదాయం రూ. 3,21,390 కోట్లు. అంత ఆదాయం ఎలా వచ్చిందో తెలుసా ? మందు రేట్లు విపరీతంగా పెంచడం, రిజిస్ట్రేషన్లు, భూమి రేట్లు పెంచడం, దీజెల్ పెట్రోల్ మీద అత్యధిక పన్నులు, చెత్త పన్ను లాంటి పన్నులు వేయడం.

మద్యపాన నిషేధం గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. ఒక్క లిక్కర్ పన్నుల ద్వారానే ఈ నాలుగున్నరేళ్ళలో కనీసం రూ. 65 -70,000 కోట్లు వచ్చాయి. అదే టిడిపి హయాంలో మద్యం ఆదాయం ఐదేళ్లు కలిపి రూ.25,000 కోట్లకు మించలేదు.. మద్యం ఫైవ్ స్టార్ హోట్లల్లోనే వుండాలి అంటారు. రాష్ట్ర స్వంత ఆదాయంలో 20 % మద్యం నుంచే సంపాదిస్తున్నారు. మాటలకు చేతలకి పొంతన ఉండదు. ఇక భూమి ధరలు రెండేళ్ళకో సారి పెంచుతూనే వున్నారు. పెట్రోల్ దీజెల్ మీద పన్నులు దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ…

సరే….కనీసం మద్యం ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నారా అంటే…అదీ శూన్యం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సొంత కాళ్ళ పై నిలబడే సబ్ ప్లాన్ నిధులను ఈ నాలుగున్నర ఏళ్లలో రూ. లక్షా 14 వేల కోట్లు దారి మళ్ళించారు. సామాజిక న్యాయాన్ని గొంతు కోశారు. మళ్ళీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ, మోసకారి మాటలు చెప్తారు. బీసీ ప్లాన్ కింద, రూ. 75, 760 కోట్లు, SC సబ్ ప్లాన్ కింద 28149 కోట్లు, ST సబ్ ప్లాన్ కింద 5355 కోట్లు, , మైనారిటీ సబ్ ప్లాన్ కింద, రూ. 5400 కోట్లు..మొత్తం 114, 664 కోట్లు దారి మళ్ళించారు…
ఇంకెక్కడి సంక్షేమం

టీడీపీ హయాములో కేవలం 6 % మాత్రమే వృద్ధి రేటు అని బుగ్గన గారు వాక్రుచ్చారు. ఇదిగో cag ఇచ్చిన ఆర్ధిక పరిస్థితి మీద WHITE paper…!

ఇక అప్పులు , ఈ ప్రభుత్వమూ ఈ అప్పుల విషయం పూటకో మాట చెబుతూనే వుంది…మేము ధైర్యంగా చెబుతాం, మా ప్రభుత్వంలో అప్పులు ఎంత అని.ఇదిగో CAG ఇచ్చిన రిపోర్ట్ లోని page

– 1,09,425 కోట్లతో మేము 2014లో మొదలు పెట్టాము. 2019లో రూ. 2,57,510 కోట్లతో ముగించాము.
– మీరు ధైర్యంగా ఒక WHITE PAPER ఇవ్వగలరా…? ఈ రోజుకి, నాలుగున్నర సంవత్సరాల్లో, ……
– రిజర్వ్ బ్యాంక్ ద్వారా తీసుకొన్నది, ఎంత ?
– కార్పోరేషన్ల ద్వారా తీసుకొన్నది ఎంత?
– అప్పుల కోసమే పెట్టిన కార్పోరేషన్ల ద్వారా తీసుకొన్నది ఎంత ?
– లిక్కర్ బండ్ల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకొన్నది ఎంత…?
– ఆస్తులు య్హనఖా పెట్టి బ్యాంకుల నుంచి తీసుకొన్నది ఎంత?
– వివిధ సంస్థల ప్రావిడెంట్ ఫండ్ మొదలగు బకాయిలు ఎంత?
– నాబార్డ్ ద్వారా వున్నా బకాయిలు ఎంత?

కేవలం ఈ సంవత్సరం ఆంద్ర ప్రదేశ్ కు ఇచ్చిన FRBM లిమిట్, 30275 కోట్లు మాత్రమే
• రైతుల మోటార్లకు కెపాసిటర్లు లాంటివి పెట్టి సంపాదించుకొన్న పరిమితి ఇంకొక నాలుగైదు వేల కోట్లు
• మీరేమో ఆర్బీఐ ద్వారానే ఇప్పటికే 45వేల కోట్ల అప్పు దాటిపోయారు
• దీనికి అదనం కార్పోరేషన్లు ద్వారా తెస్తున్న అప్పులు ; ప్రభుత్వ ఆస్తులు pledge చేసి తీసుకొన్న అప్పులు
• ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు , రిటైర్మెంట్బకాయిలు; కాంట్రాక్టర్ల కు బకాయిలు
• మారిటైం బోర్డు అప్పులు; ప్రభుత్వ పాత బకాయిలు ; పబ్లిక్ అకౌంట్ ఫండ్ లో నుంచి పెట్టిన ఖర్చు
• కేంద్రం నుంచి పంచాయితీలకు వచ్చిన డబ్బు ; డిసాస్టర్ ఫండ్,
• డిస్కమ్ లు, సివిల్ సప్లై అప్పులు,
• జెన్కో, ట్రాన్స్కో, నుంచి వాడుకొన్న ఫండ్స్
• ఇవన్నీ అప్పులే కదా…..ఇవన్నీ పదకొండు లక్షల కోట్ల పరిధిలోకి వస్తాయి కదా….

మేమొక లిస్టు ఇస్తున్నాము….. చూడండి. ఇది మా ప్రకారం ఈ రోజుకి వుండే ఆంద్ర ప్రదేశ్ అప్పుల లిస్టు….
ఇది తప్పా కాదా చెప్పండి. ఒక వేల తప్పైతే, ఎక్కడ, ఎంత తప్పో చెప్పండి….
సంస్థ వారీగా ఇస్తున్నాము…
ఈ లిస్టు ప్రకారమే…మీరు ఒక శ్వేత పత్రం విడుదల చేయగలరా?
మా అప్పులు ఇంతే అని చెప్పగలరా?
రూ.11 లక్షల కోట్ల అప్పులు
సంక్షేమానికి రూ.2 లక్షల కోట్లు పోతే… మిగిలిన లక్షల కోట్లు ఏమయ్యాయి జగన్‌రెడ్డీ..?

వివరాలు (రూ.కోట్లలో)
మార్చి 31, 2019 నాటికి ఉన్న అప్పులు
(శ్వేతపత్రం 10.07.2019 ప్రకారం) 3,62,375
2019 ఏప్రిల్‌ నుండి 2023 మార్చి వరకు అప్పులు 6,72,510
2023 ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ వరకు అప్పు 61,500
4 ఏళ్లలో జగన్‌ రెడ్డి ఒక్కడే చేసిన అప్పు 7,34,010
66 ఏళ్లలో 18 మంది సి.ఎంలు చేసిన అప్పు 3,62,375
ఆర్.బి.ఐ నుంచి తీసుకున్న రుణాలు 2,17,216
2 భారత ప్రభుత్వంనుంచి తీసుకున్న రుణాలు 5,992
3 కార్పొరేషన్రుణాలు(గ్యారెంటీలు) 92,603
4 నాన్‌ గ్యారెంటీ రుణాలు(మార్ట్గేజీ) 94,928
5 నేషనల్‌ సోషల్‌ సెక్యురిటీ ఫండ్స్‌ 8,945
6 సబ్సిడీ బకాయిలు, డిస్కంలకుచెల్లించాల్సినవి 27,384
7 లిక్కర్‌ బాండ్లు 8,305
8 కాంట్రాక్టర్లకుబిల్లు బకాయిలు 86,500
9 ఉద్యోగుల బకాయిలు 30,100
10 పబ్లిక్‌ అకౌంట్‌ ఫండ్స్‌ నుంచి తీసుకున్నవి 22,850
11 సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్రుణాలు 31,500
12 వివిధ సంస్థల నుంచి తీసుకున్నఫిక్సుడు డిపిజిట్లు 11,170
ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్కార్పొరేషన్‌ లి. రుణాలు 10,000
14 14, 15 వ ఆర్ధికసంఘం నిధులు 8,608
15 ఏపీ మ్యారిటైం బోర్డు 5000
16 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి లిక్కర్లోన్‌ 1,400
17 డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ ఫండ్స్‌ 1,100
18 సింకింగ్‌ ఫండ్కాంట్రిబ్యూషన్స్‌ 2,774
19 జెన్‌-కో, ట్రాన్స్‌ కో ఉద్యోగులపీఎఫ్‌ నిధులు 3,600
20 ఎన్‌.పి.ఎస్‌ ఫండ్స్‌ 1,338
21 గ్యారెంటీ రిడంఫ్షన్‌ ఫండ్స్‌ 953
22 ఈఎస్‌ఐ నిధులు 155
23 కంటింజన్ట్‌ ఫండ్స్‌ 50
24 నాబార్డు లోన్‌ 40
వైసీపీ ప్రభుత్వం మొత్తం అప్పులు….. 7,34,010

ఒక ‘వైట్ పేపర్’ ప్రకటించండి……మా తప్పులు ఎక్కడైనా వుంటే, మేము సరిదిద్దుకొంటాము…ప్రజలకు వాస్తవాలు చెబుతాము….

LEAVE A RESPONSE