అప్పుడు చిరంజీవిని, కేసీఆర్‌ను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తన్ని బయటికి పోయినవ్

– జాతీయ అధికార ప్రతినిధి అని జాతీయ లీడర్ లెక్క ఫీల్ ఔతడు
– టెంపుల్ ల్యాండ్ స్కామ్ పై ఒక్కరోజు ప్రెస్ మీట్ ఎందుకు ఉరుకున్నావ్?
– మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్

దాసోజు శ్రవణ్ ప్రస్థానం ఎక్కడి నుండి మొదలైంది? ప్రజారాజ్యంలో చిరంజీవి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చాడు. తెలంగాణలో బీసీ నాయకుడిగా ఎక్స్ పోజర్ చేసిండు. కానీ సామాజిక న్యాయం లేదని రాళ్లతో దాడి చేయించినవ్. అక్కడి నుండి టీఆర్ఎస్ లో చేరినవ్. మౌత్ పీస్ గా మారినవ్. కేసీఆర్ కూడా బాగా సపోర్ట్ చేసిండు. భువన గిరి టికెట్ ఇయ్యకపోతే కేసీఆర్ను తన్ని బయటికొచ్చింది.

కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలో ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ గా గుర్తింపు ఇచ్చింది.జైపాల్ రెడ్డి తరహాలో చూసింది.బలహీన వర్గానికి చెందిన దాసోజుకు ఎక్కడ తక్కువ చేసింది? రేవంత్ వచ్చాక నీ పదవీ తక్కువ చేసిండా? 2014లో ఖైరతాబాద్ టికెట్ ఇచ్చింది. 2007 నుండి రోహిన్ రెడ్డి పనిచేస్తున్నా నీకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం గౌరవం అని పార్టీ వీడడం సబబా? సోనియా కు ఈడీ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడ్తుంటే ఎప్పుడైనా ధర్నాలో పాల్గొన్నవా?

నమ్మక ద్రోహివి, అవకాశవాదివి. అప్పుడు చిరంజీవిని, కేసీఆర్ను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తన్ని బయటికి పోయినవ్. నీకంటే సీనియర్ లీడర్ను నేను.. మాజీ ఎమ్మెల్యేగా, విప్ గా పనిచేశా. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం చేసినప్పటి నుండి నాకు ఎలాంటి పదవులు రాలేదు. బిజెపిలోకి ఎందుకు పోతున్నావ్? నిత్యావసర వస్తువులు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకు పోయినవా? పాలు, పెరుగు కు జీఎస్టీ వేసినందుకు పోయినవా? అదానీ, అంబానీలకు మోడీ సపోర్ట్ చేస్తున్నాడని పోయినవా? దేనికోసం పోయినవ్ బిజెపిలోకి.. నీకు ఉద్యోగం ఇస్తుందని పోయావా? సిగ్గన్న ఉండాలి నీకు. ఇంకోసారి రేవంత్ పై విమర్శలు చేస్తే బాగోదు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాల్సింది పోయి.. పారిపోయావు.

రోహిన్ రెడ్డి;
బిజెపి లీడర్లపై గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టిన దాసోజు బిజెపిలకే పోతున్నావ్. నియోజకవర్గంలో ఆయన్ని ఎవరు గుర్తుపట్టరు. సోకాల్డ్ లీడర్ గా ఫీల్ ఔతడు. ప్యారాషూట్ లెక్క వచ్చి 2014లో ఖైరతాబాద్ టికెట్ తీసుకున్నడు. జాతీయ అధికార ప్రతినిధి అని జాతీయ లీడర్ లెక్క ఫీల్ ఔతడు. రాత్రి 9 ఐతే ఎత్తిపోతల పథకమే. పార్టీ కోసం రక్తం దారపోసింది లేదు. ఓ బీసీ నాయకుడికి టికెట్ ఇస్తే.. డబ్బులు తీసుకోలేదా? కాంగ్రెస్ కార్యకర్తలు దాసోజు శ్రవణ్ కోసం కష్టపడ్డరు. ఫిలింనగర్ ఆంజనేయుడి స్వామి టెంపుల్ ల్యాండ్ స్కామ్ పై ఒక్కరోజు ప్రెస్ మీట్ ఎందుకు ఉరుకున్నావ్? ఎక్కడి నుండి సూటికెస్ వచ్చిందో చెప్పాలా? ఎల్-1 దర్శనం ఎప్పుడు మొదలవుతుందో నీకు తెలుసా? ఖబర్దార్ దాసోజు శ్రవణ్.. నీకు ఎలా బుద్ది చెప్పాలో మాకు తెలుసు. నోరు జారితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.

Leave a Reply