Suryaa.co.in

Telangana

కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా పై కేంద్రం తప్పుడు ప్రచారం

-పార్లమెంటులో కేంద్రం ప్రకటన పై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
-జాతీయ హోదా కోసం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-రాజకీయ కక్షతో జాతీయ హోదా ఇవ్వని కేంద్రం
-బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రెండు ప్రాజెక్టులకు మాత్రం హోదా
-కేంద్రం వివక్షను ఎండగడుతూ మంత్రి హరీశ్ రావు వరుస ట్వీట్లు

Tweet -1
కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు వ్యాఖ్యలు అవాస్తవం. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను ఎన్నోసార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నది.

Tweet – 2
కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సిడబ్ల్యుసి అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర జల శక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు సైతం లభించాయి. ఈ నేపథ్యంలో గౌరవ సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Tweet – 3
2018లో టిఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంట్లో ప్రశ్నించగా నాటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. కానీ ఈ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్ లోని కెన్ – బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. తెలంగాణ ప్రతిపాదనను మాత్రం పక్కన పెట్టింది. ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనం.

Tweet – 4
కేడబ్ల్యుడిటి-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సిడబ్ల్యుసి అనుమతులు ఇచ్చింది, న్యాయవిచారణ పూర్తికాకముందే కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా ప్రకటించింది. కానీ అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాతీయ హోదా ప్రకటించలేదు. ఇది రాజకీయ కక్ష కాదా?

LEAVE A RESPONSE