-
నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలి
-
కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి అనీల్ సుబ్రహ్మణ్యంకు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి వినతి
-
యనమల కుదురులో కేంద్ర బృందాన్ని కలసిన కిసాన్ మోర్చా నేతలు
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేయడానికి విచ్చేసిన కేంద్ర బృందానికి విన్నపం
విషయము: …భారీ వర్షాలు, వరదలు, విపత్తుల వలన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధమిక అంచనాల ప్రకారం, 6,880 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రాధమిక అంచనాల కన్నా వాస్తవ నష్టం రెట్టింపు ఉంటుంది.
వ్యవసాయానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. పంట నష్టం మదింపు చేసి రైతాంగానికి నష్ట పరిహారమును త్వరగా అందించడం కోసం తగుచర్యలగురించి…….ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు సృష్టించిన జల ప్రళయానికి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ బుదర నీటిలో తిండి, తిప్పలు లేకుండా గడుపుతున్నారు.
బుడమేరుకు గండ్లు పడటంతో విజయవాడ భారీ వర్షాలకు దెబ్బతినడమే కాక, బుడమేరు వరదతో కొల్లేరు వరకు పంట పొలాలు గత 10 రోజులుగా పంటలు ఆరు అడుగుల నీటిలో మునిగి ఉన్నాయి.వరి, ప్రత్తి, మిరప, అపరాలు, ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతినగా, పంట పొలాలకు వెళ్ళే రోడ్లు గండ్లు పడి పొలాలకి చేరుకోవం కూడా ఇబ్బందిగా మారింది. దాదాపు 7 లక్షల ఎకరాలలో పూర్తిగా దెబ్బతిన్న పంట నష్టం వాస్తవ అంచనాలను త్వరగా మదింపు చేసి పూర్తి నష్ట పరిహారం రైతులకు అందించే విదంగా చర్యలు చేపట్టవలసినదిగా కోరుచున్నాము.
దీనితో పాటు వ్యవసాయ అనుబంధ పాడి పశువులు వందల సంఖ్యలో మృతి చెందగా, వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. అనేక చోట్ల పశు గ్రాసం వరదలకు కొట్టుకు పోవడం లేదా తడిసి పనికిరాని పరిస్థితులలో ఉన్నది. వీరికి పశు గ్రాసం ఉచితముగా సరఫరా చేయడంతో పాటు వెంటనే నష్ట పరిహారం అందేలా చూడాలి. రాష్ట్రంలో 5 లక్షల పైగా రైతులు 8 లక్షల ఎకరాలలో పంటను పూర్తిగా కోల్పోయిన పరిస్థితులలో వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి,
ఈ క్రింది చర్యలు…
- చేపట్టవలసినడదిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేస్తుంది.
- పంట నష్టం వెంటనే మదింపు చేసి రైతాంగానికి పూర్తి నష్ట పరిహారాన్ని అందించాలి.
“వర్షాలు, వరదలకు దెబ్బ తిన్న పంట కాలువలు, మురుగు పారుదల కాలువలు, పొలాలకు వెళ్ళే రోడ్లు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి. - ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలి.
- బ్యాంకు రుణాలు రీ-షెడ్యూల్ చేసి, రైతులకు మరల పంట రుణాలు అందించాలి.
రైతులకు ఉదారంగా నష్టపరిహారం ఉండే విధంగా విధివిధానాలను రూపొందించాలి
- కౌలు రైతులకు నిబంధనలు సడలించి, నష్ట పరిహారం నేరుగా అందేలా చర్యలు చేపట్టాలి.
- పంటల భీమా పథకాన్ని రైతులందరకి వర్తింపచేసేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.
చిగురు పాటి కుమార స్వామి,
బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు