Suryaa.co.in

Telangana

జమీర్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం

ఇటీవలే న్యూస్ కవరేజీకి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయి ప్రాణం కోల్పోయిన జగిత్యాల ఎన్టీవీ ప్రతినిధి జమీర్ కుటుంబానికి గల్ఫ్ టీడీపీ ఎన్నారై సెల్ మానవతా దృక్ఫతంతో తనవంతు సహకారాన్ని అందించింది. జమీర్ అకాల మరణంతో అతని కుటుంబం రోడ్డున పడిందనే సమాచారాన్ని అందుకున్న గల్ఫ్ టీడీపీ ఎన్నారై సెల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ, సౌదీ అరేబియా టీడీపీ ఎన్నారై సెల్ బాధ్యులు ఖాలిక్ సైఫుల్లాలు లక్ష రూపాయల ఆర్థిక సహకారాన్ని శుక్రవారం నాడు లోవర్ ట్యాంక్ బండ్ లోని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) కేంద్ర కార్యాలయంలో జమీర్ తల్లి బషీర్ బీ, పిల్లలు సఫీయాన్, సారా సద్దాఫ్ లకు అందించారు. మానవతా దృక్పథంతో జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించిన టీడీపీ గల్ఫ్ ఎన్నారై సెల్ బాధ్యులను టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు అభినందించారు.

LEAVE A RESPONSE