వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా ఫైర్ సర్వీస్ సేవలు…

విజయవాడ- జూలై 16:- వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఇన్చార్జి డైరెక్టర్ మురళీమోహన్ నేతృత్వంలో ఈనెల 12వ తేదీ నుండి ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, రాజమండ్రి, పాడేరు, కాకినాడ జిల్లాల పరిధిలోని వరద ముంపు22 ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల సహకారంతో ఇప్పటివరకూ 10 వేల కిలోల కందిపప్పు, 5 వేల లీటర్ల పామాయిల్, 19 కిలోల ఉల్లిపాయలు, 5 వేల కిలోల బంగాళదుంపలు, 37 వేల ఆహార పొట్లాలు,350 టార్పాలిన్ షీట్లు, 50 బండిల్స్ వస్త్రాలు ముంపు ప్రాంత ప్రజలకు పంపిణీ చేశారు.image-4

Leave a Reply