– ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని
ఏలూరు: ఏలూరు రూరల్ మండలంలోని కొల్లేటి, పరిసర గ్రామాల్లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం మరోసారి కొల్లేటి లంక గ్రామాల్లో పర్యటించారు. రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటం, క్రమేపీ నీటి ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక కూటమి నాయకులు, గ్రామస్తులు, అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం, చాటపర్రు గ్రామంలో జరుగుతున్న విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాలు తయారీ ప్యాకింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.