క్యాసినోలపై కాదు కంపెనీలపై దృష్టిపెట్టండి!

• జగన్మోహన్ రెడ్డి అవినీతివల్లే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు దూరమయ్యాయి
• జగన్మోహన్ రెడ్డి చెబుతున్న రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అంతా అవినీతి బురదపత్రికఅయిన సాక్షిలోని తప్పుడు రాతలకే పరిమితం
• టిడిపి ప్రభుత్వం సిద్ధం చేసిన 10వేల ఎకరాల ఓర్వకల్లు పారిశ్రామికపార్కులో 5వేల ఎకరాలు మీ రియల్ ఎస్టేట్ దందాకు కొట్టేయడమేనా పారిశ్రామికాభివృద్ధి అంటే?
• ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెస్లా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆనాడు చంద్రబాబుగారు ఒప్పిస్తే నేడు జగన్ రెడ్డి నిర్వాకం వల్ల ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లడం వాస్తవం కాదా?
-టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

రాష్ట్రానికి దిగ్గజ కంపెనీల రాక… పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి అని, రూ.96,400కోట్ల మేర 4 బడా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని అవినీతి పుత్రిక సాక్షిలో నిన్న తప్పుడు రాతలు రాశారు, రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 15కు పైగా ప్రముఖకంపెనీల పెట్టుబడి’ అని నిస్సిగ్గుగా అబద్దాలను వండివార్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. వైసీపీప్రభుత్వ పనితీరుకి ఆకర్షితులై రాష్ట్రానికి పారిశ్రామి కవేత్తలు క్యూకడుతున్నట్లు, ముఖ్యమంత్రి తన నైపుణ్యత, పనితీరుతో పెట్టుబడులు రాష్ట్రాని కి వస్తున్నట్లు సొంతపత్రికలో గొప్పగా కలరింగ్ ఇచ్చారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారానికి క్యాసినోలపై ఉన్న శ్రద్ధ, కంపెనీలు, పెట్టుబడుల ఆకర్షణపై లేకపోవడం వల్ల రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధిలో తీవ్రంగా నష్టపోతోంది. చేతిలో అవినీతి బురదపత్రిక ఉంది కదా అనిఏదిపడితే అదిరాసేసి, ప్రజలను నమ్మించాలను కుంటే ఎలా? ఎప్పటిలాగే తప్పుడురాతలతో ప్రజలను నమ్మించాలని వైసీపీనేతలు, ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. వారి తప్పుడు రాతలను, చేష్టలను ఎప్పటికప్పుడు సహేతుకమైన, అర్థవంతమై న ఆధారాలతో బాధ్యతగల ప్రతిపక్ష నాయకులుగా తాము ఎండగడుతూనే ఉంటాము.

రాష్ట్రప్రభుత్వ గెజిట్ అయిన సాక్షిపత్రికలో ఒక పట్టిక వేసిమరీ ప్రభుత్వరంగసంస్థల ద్వారా ఏపీకి రూ.96,400కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్టు, తూర్పుగోదావరి జిల్లాలోని ఓఎన్ జీసీ లో రూ.78వేలకోట్ల పెట్టుబడిపెట్టి, దాదాపు 75వేలమందికి ఉపాధికల్పించబోతున్నట్టు, జగన్మోహన్ రెడ్డి ఆ ఘనత సాధించినట్టు రాసుకొచ్చారు. జగనన్న ప్రభుత్వ పనీతీరు చూసి ఓఎన్ జీసీవారు రూ.78వేలకోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారా? కేంద్రప్రభుత్వ సంస్థ లైన ఓఎన్ జీసీ, హెచ్ పీసీఎల్, బీఈఎల్ లాంటి సంస్థలు, వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటినుంచీ ఏపీలో రూ.96వేలకోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని, ఒక్క ఓఎన్ జీసీనే తూర్పుగోదావరిజిల్లాలో రూ.78వేలకోట్లపెట్టుబడి పెట్టడానికి సిద్ధమైందని అవినీతిబురద పత్రికలో రాసుకొచ్చారు.

బురదపత్రికలో రాతలు అలాఉంటే, వాస్తవాలు మరోరకంగా ఉన్నాయి. ఓఎన్ జీసీ కి సంబంధించిన రూ.78వేలకోట్ల పెట్టుబడికి సంబంధించిన అసలు నిజాల ఒఎన్ జిసి వెబ్ సైట్ లోనే ఉన్నాయి. 2017 జనవరి 28న ఓఎన్ జీసీ వారు ఒకపత్రికా ప్రకటన ఇచ్చారు. దానిలో ఏపీప్రభుత్వం ఓఎన్ జీసీవారికి సింగిల్ విండో విధానంలో అన్నిరకాల అనుమతులు త్వరితగతిన ఇచ్చేందుకు ముందుకువచ్చారని తెలియజేస్తూ వారు కల్పిస్తున్న సౌకర్యాలకు ఆకర్షితులై ఆయిల్ అండ్ గ్యాస్ కి సంబంధించి వ్యాపారంలో రూ.10వేలకోట్లు ఆన్ షోర్ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టనున్నట్లు, ఆఫ్ షోర్ సముద్రంలో ఏర్పాటుచేసే రిగ్స్ కు సంబంధించి రూ.68వేలకోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు చెప్పారు. మొత్తంగా రూ.78వేలకోట్ల పెట్టుబడులకు సంబంధించి, ఆనాటి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రపెట్రోలియం, సహజవాయువుల శాఖామంత్రి ధర్మేంధ్రప్రదాన్, ఓఎన్ జీసీ సీఎండీ దినేశ్ షరాఫ్ గారి సమక్షంలో ఒప్పందంజరిగిందని కూడా ఓఎన్ జీసీ సదరు ప్రకటనలో స్పష్టంచేసింది. దీనినిబట్టి అధికార పార్టీ తన అవినీతి పత్రికను అడ్డుపెట్టుకొని ఏ స్థాయిలో అబద్దపు రాతలు రాయిస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తుందో అర్థమవుతుంది. ఇకనైనా ఇతర పత్రికలు, మీడియా సంస్థలపై విషం చిమ్మడం మానేసి కనీస విలువలు పాటిస్తూ వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేయాలని సాక్షి యాజమాన్యానికి సూచిస్తున్నాం.

అదేవిధంగా గతంలో చంద్రబాబునాయుడు గారు అమెరికా పర్యటనలో స్వయంగా టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ గారిని రాష్ట్రంలో పెట్టుబడికి ఒప్పిస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అదే టెస్లా కంపెనీ వారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి భయభ్రాంతులై ఏపీ తప్ప మిగతా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎలాన్ మస్క్ గారికి స్వయంగా సందేశం పంపి వారి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వనించారు. అలానే పశ్చిమబెంగాల్, మహరాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు టెస్లాకంపెనీకోసం నేడు మూకుమ్మడిగా పోటీపడుతున్నాయి. మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ కూడా, తమరాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని టెస్లా కంపెనీ సీఈవోకి సందేశం పంపారు. పశ్చిమ బెంగాల్ తరుపున మహ్మద్ గులామ్ రబ్బానీ కూడా టెస్లా కంపెనీకి స్వాగతంపలికారు. ఈ జాబితాలో ఏపీ ఎక్కడుంది? బ్యాటరీ కార్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగాఉన్న టెస్లా కంపెనీని ఏపీలో నెలకోల్పడానికి చంద్రబాబునాయుడు కృషిచేస్తే, ఈ ముఖ్యమంత్రి వచ్చాక వారు దండంపెట్టి రాష్ట్రం విడిచిపోయేపరిస్థితి కల్పించాడు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలతో ఏ కంపెనీకూడా ఏపీవైపు కన్నెత్తైనా చూడటంలేదు. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇతరరాష్ట్రాలవైపు చూస్తుంటే ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా? పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి గోళ్లు గిల్లుకుంటున్నారా? ఎందుకని ముఖ్యమంత్రిగానీ, పరిశ్రమలమంత్రిగానీ టెస్లాకంపెనీని సంప్రదించలేదు? ముఖ్యమంత్రి చేతగానితనం వల్లే ప్రపంచప్రఖ్యాత టెస్లా కంపెనీ రాష్ట్రం చేజారిపోయింది. ఇదేనా సాక్షిలో రాసిన పారిశ్రామికాభివృద్ధి? టెస్లా కంపెనీ రాష్ట్రం చేజారిపోవడం ప్రభుత్వం ప్రజలకు ఏంసమాధానం చెబుతుంది?

హైదరాబాద్ – బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా, కర్నూల్లో ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పడానికి చంద్రబాబునాయుడి గారి హయాంలో అంకురార్పణ జరిగింది. దానిలో భాగంగా 10వేలఎకరాల భూమిని టీడీపీప్రభుత్వం సిద్ధంచేసింది. అంత గొప్ప ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి కూడా ఈముఖ్యమంత్రి పంగనామాలు పెట్టడానికి సిద్ధమయ్యాడు. కర్నూలుజిల్లాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ కి 10వేలఎకరాలకు బదులు, కేవలం 5వేలఎకరాలు మాత్రమే ఇస్తామన్న రాష్ట్రప్రభుత్వనిర్ణయం అత్యంత దురదృష్టకరమని కేంద్రవాణిజ్యశాఖామంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్ లో చెప్పింది వాస్తవం కాదా? రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రమంత్రి అన్నది నిజంకాదా? బీజేపీఎంపీ జీవీఎల్ నరసింహారావు, టీడీపీఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్రమంత్రి చెప్పిన సమాధానంపై ముఖ్యమంత్రి ఏంచెబుతారు? 10వేల ఎకరాలకు బదులు కేవలం 5 వేలఎకరాలు మాత్రమే పరిశ్రమలకు పార్కుకు అందజేస్తామని చెప్పి మిగతా 5వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ దందాకి శ్రీకారం చుట్టడమేనా? బురదపత్రిక సాక్షిలో రాసిన పారిశ్రామిక అభివృద్ధి? కేంద్రానికి ఇచ్చిన 5 వేలఎకరాల్లో ఏవైనా పరిశ్రమలు వస్తే, వాటినిచూపించి మిగిలిన 5వేలఎకరాల్లో రియల్ దందా చేస్తారా? రియల్ ఎస్టేట్ వ్యాపారంకోసం ఈ ప్రభుత్వంపారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకుంటున్నది అనడానికి ఇదే ఉదాహరణ.

నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గుంటూరులో రిబ్బన్ కట్ చేసిన ఐటీసీ హోటల్ కూడా చంద్రబాబునాయుడు తీసుకొచ్చిందే. ఏప్రియల్ 29, 2016న ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి చంద్రబాబుగారు శంఖుస్థాపనచేశారు. కొన్నివందలకోట్ల పెట్టుబడిని, ఫైవ్ స్టార్ హోటల్ ని ఆనాడు చంద్రబాబుగారు ఐటిసి వారిని ఒప్పించి రాష్ట్రానికి తీసుకొస్తే అదంతా ప్రజలకు తెలియనట్లు, ఈ ముఖ్యమంత్రి ఏదో ఐటీసీ వారితో చర్చించి వారి ఫైవ్ స్టార్ హోటల్ రాష్ట్రానిక వచ్చేలా చేసినట్లు బురదపత్రిక సాక్షిలో బిల్డప్ లు, కలరింగ్ లు ఇస్తారా?

జగన్ ప్రభుత్వ అవినీతివల్లే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు రాష్ట్రానికి రావడంలేదని, కేంద్రప్రభుత్వ సంస్థ డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వారు వెబ్ సైట్ లో పెట్టిన నివేదిక తేటతెల్లంచేస్తోంది. ప్రతి సంవత్సరం ఏఏ రాష్ట్రానికి ఎంతెంత పెట్టుబడులు వచ్చాయనే వివరాలను సదరుసంస్థ వెల్లడిస్తుంది. సదరు నివేదిక ప్రకారం టీడీపీప్రభుత్వహయాంలో 2014-19 మధ్యన ఐదేళ్ల కాలంలో రూ.65,327కోట్ల విదేశీపెట్టుబడులు రాష్ట్రానికివస్తే, జగన్ రెడ్డి అసమర్థప్రభుత్వంలో రెండేళ్లలో కేవలం రూ.2740కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2014-15లో రూ.8,326కోట్లు, 2015-16లో రూ.10,315కోట్లు, 2016-17లో రూ.14,767కోట్లు, 2017-18లో రూ.8037కోట్లు, 2018-19లో అత్యధికంగా రూ.23,882 కోట్లు విదేశీపెట్టుబడులు వచ్చాయి.

చంద్రబాబునాయుడి హయాంలో ఏటా సగటున రాష్ట్రానికి రూ.13,065 కోట్ల విదేశీపెట్టుబడులు వస్తే, ఈ పనికిమాలిన ప్రభుత్వంలో అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2021వరకు కేవలం రూ.2,740కోట్లు మాత్రమేవచ్చాయి. అంటే ఏటా కేవలం రూ.1370కోట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీప్రభుత్వంలో ఏటా సరాసరిన రూ.13065కోట్ల పెట్టుబడులువస్తే, దానిలో కేవలం 10శాతం మాత్రమే విదేశీ పెట్టుబడులు, ఈప్రభుత్వంలో రావడం సిగ్గుచేటు. రాష్ట్రానికి 90శాతం విదేశీపెట్టుబడులు తగ్గింది వాస్తవంకాదా? జగన్మోహన్ రెడ్డి అవినీతి దెబ్బతోనే ఏపీకి విదేశీపెట్టుబడులు తగ్గాయికానీ కోవిడ్ వల్ల కాదు.

కోవిడ్ ఉన్నా కూడా మహారాష్ట్రకు రూ.2లక్షల22వేలకోట్లు, గుజరాత్ కు లక్షా92వేలకోట్ల విదేశీపెట్టుబడులు వస్తే, కర్ణాటకకు రూ.లక్షా90వేలకోట్లు, ఢిల్లీకి రూ.లక్షా 6వేల కోట్లు, పొరుగునఉన్న తెలంగాణకు రూ.20,988కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు రూ.2,740కోట్లు రావడం సిగ్గుచేటుకాదా? గత రెండేళ్లలో భారతదేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో, ఏపీకి వచ్చింది కేవలం 0.3శాతం మాత్రమే. ఇలాంటి ప్రగతి సాధించడమేనా మీరు చేసిన పారిశ్రామిక అభివృద్ధి? ఈ లెక్కలన్నీ ఇంతస్పష్టంగా కనిపిస్తున్నాకూడా సిగ్గులేకుండా అబద్ధాలుచెబుతూ, చేతిలో పత్రిక ఉందికదా అని పారిశ్రామిక అభివృద్ధి అంటారా? ఈ ఆర్థిక సంవత్సరంలో (మార్చి నుంచి సెప్ల్టెంబర్) దేశం మొత్తానికి రూ.2,29,929 కోట్ల విదేశీపెట్టుబడులు వస్తే, ఏపీకి చచ్చీచెడీ వచ్చింది కేవలం రూ.626కోట్లు మాత్రమే. అదేనా మీరు సాధించిన ప్రగతి? అంటే మొత్తం పెట్టుబడుల్లో 0.27శాతం మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఇదే సమయంలో కర్ణాటకకు రూ.లక్షా 2వేల869కోట్ల విదేశీపెట్టుబడులు ఈఆర్థిక సంవత్సరంలో వస్తే,తమిళనాడుకు రూ.8, 369కోట్లు, తెలంగాణకు రూ.7,506కోట్ల విదేశీపెట్టుబడులు వస్తే, ఏపీకి రూ.626కోట్లా? ఈ ముఖ్యమంత్రి అవినీతిదాహందెబ్బకు, అవికూడా ఎంతవరకు నిలుస్తాయో తెలియదు. సిగ్గుందా అసలు మీకు? కోవిడ్ పరిస్థితి ఉన్నా కూడా ఆ రాష్ట్రాలకు లక్షలకోట్ల విదేశీపెట్టుబడులు ఎలావచ్చాయి? పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు కీలకమైన ఈ లెక్కలు చూశాక ఏపీ ప్రభుత్వపెద్దలు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. అనేక రాష్ర్ట్రాలతో పోల్చిచూస్తే పెట్టుబడలు ఆకర్షణలో ఏపీ అట్టడుగున ఉంది.

సమాచారహక్కు చట్టంద్వారా ఎమ్ ఎస్ ఎమ్ ఈలకు సంబంధించిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన గురించి అడిగిన సమాచారానికి జగన్ ప్రభుత్వ ఇచ్చిన సమాధానం- .. నవంబర్ 15, 2021న వారు చెప్పిన ప్రకారం 2018-19లో ఎమ్ ఎస్ ఎంఈ లకు సంబంధించి వచ్చిన పెట్టుబడి రూ.3,443కోట్లు కాగా, 93,240 మందికి ఉద్యోగాలు కల్పించడంకూడా జరిగింది. ఉద్యోగాల కల్పనలో టార్గెట్ కంటే ఎక్కువగా 122శాతాన్ని రీచ్ అయ్యారు. అదే ఎమ్ ఎస్ఎంఈలకు సంబంధించి 2020-21లో జగనన్న ప్రబుత్వంలో ఎమ్ ఎస్ ఎంఈల పెట్టుబడి రూ.1024 కోట్లుమాత్రమే. నిర్దేశించుకున్న లక్ష్యంలో ఈ ప్రభుత్వం కేవలం 13శాతం మాత్రమే రీచ్ అయ్యింది. ఉద్యోగ కల్పనకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 23,141 మందికి మాత్రమే ఎంఎస్ ఎంఇల ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. ఇది 2018-19తో పోల్చితే దాదాపు 70వేల ఉద్యోగాలు తక్కువ. ఇదేనా మీరు సాధించిన పారిశ్రామిక అభివృద్ధి? ఉపాధి కల్పన? ఈ విధంగా ఎన్నిరకాలుగా చూసినా జగన్ ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది మచ్చుకైనా లేదు. వారు చెబుతున్న రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అంతా అవినీతి బురదపత్రికఅయిన సాక్షిలోని రాతలకే పరిమితం.

Leave a Reply