Suryaa.co.in

Telangana

ఈనెల 21న రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం

– పోస్టర్ ను ఆవిష్కరించిన వినోద్ కుమార్, బండ ప్రకాష్

రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ముదిరాజ్ మహాసభ వాల్ పోస్టర్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ చైర్మన్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఆవిష్కరించారు.

ప్రతి గ్రామంలో, పట్టణంలో, జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో ముదిరాజ్ జెండాలను ఎగురవేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.66 సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఎనిమిదేళ్ల కాలంలోనే ముదిరాజులకు లభించాయని వారు పేర్కొన్నారు.

మంగళవారం మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను, విద్యార్థి జేఏసీ నాయకుడు అల్లుడు జగన్, రాష్ట్ర నాయకులు డి.ఎల్. పాండు, తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE