Suryaa.co.in

Telangana

రేపటినుంచి నాలుగు రోజులు సెలవులు

హైదరాబాద్: రేపటినుంచి అంటే శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. రేపు (13) రెండో శనివారం కాగా ఎల్లుండి (14) ఆదివారం. ఇక సోమవారం 15 వ తేదిన ముస్లింల పండుగ మిలాద్ -ఉన్ -నబీ. ఇక 17 మంగళవారం హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణా వ్యాప్తంగా మొదటి మూడు రోజులూ సెలవు కాగా నాలుగో రోజు వినాయక నిమజ్జనం జరిగే హైదరాబాద్ లో మాత్రమే సెలవు ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు ఉద్యోగులకు కూడా మొదటి మూడు రోజుల సెలవు మాత్రమే వర్తిస్తుంది. నిమజ్జనం రోజు బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.

LEAVE A RESPONSE