– ఫ్రెండ్లీ పోలీస్ కార్యాచరణ ప్రణాళిక
– తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చాల
– ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల లో భాగంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ హెచ్ఎండీఏ ప్రాంగణంలో హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: రాష్ట్రంలో ఎలాంటి విపత్తు వచ్చిన ఎదుర్కోవడానికి నిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేసి, వారికి సకల వసతులు, సౌకర్యాలు కల్పించి ప్రజా ప్రభుత్వం SDRF వ్యవస్థను బలోపేతం చేసింది.
విపత్తుల వస్తే కేంద్ర బలగాలపై ఆధార పడాల్సిన పరిస్థితిని అధిగమించడానికి ఖమ్మంలో పోటెత్తిన వరదలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి state disaster response force వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించారు.
హైదరాబాద్ నగరం తో పాటు రాష్ట్రాన్ని సురక్షితంగా తీర్చిదిద్దడం కోసం ఫ్రెండ్లీ పోలీస్ కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నది.
హైదరాబాద్ నగరం తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చాలని ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నది.
రాష్ట్ర ప్రజలకు రక్షణ, ధైర్యం, నమ్మకం కల్పిస్తున్న పోలీసు వ్యవస్థ కు ఎటువంటి అవసరాలు వచ్చిన తీర్చడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలను కంటికి రెప్పల కాపాడే పోలీస్ శాఖ కు కావలసిన బడ్జెట్, రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయడానికి కావలసిన వాతావరణాన్ని ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్నది. కొంత మంది అవసరాల కోసం కాకుండా, సమాజ అవసరాల కోసం మాత్రమే పోలీస్ వ్యవస్థ ప్రజా ప్రభుత్వంలో పనిచేస్తున్నది.
హైదరాబాద్ మహానగరంలో గందరగోళ పరిస్థితులు సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకురావడానికి కొంతమంది చేస్తున్న కుట్రలను సాగనివ్వం. ప్రజా సంక్షేమం కోసం అందరం కలిసి పని చేద్దాం. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చడానికి, రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేద్దాం.
పోలీస్ సిగ్నల్స్ వద్ద యాచక వృత్తి చేస్తున్న ట్రాన్స్ జెండర్స్ కు శిక్షణ ఇచ్చి పోలీస్ శాఖలో భాగస్వామ్యం చేసిన మానవత్వం కలిగిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.