Suryaa.co.in

Telangana

బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం…విద్యార్థులకు కప్పల భోజనం

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం వెలుగు చూసింది.కప్పలతో ఆలుగడ్డ కూర్మా చేసి విద్యార్థులకు వడ్డించారు.ఓ విద్యార్థి తన ప్లేట్‎లో కప్పను చూసి ఖంగు తిన్నాడు.మిగతా విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

అయితే అధికారులు-మెస్ కాంట్రాక్టర్ సంబంధీకులు కావడంతో విషయం బయటకు పొక్కకుండా వారిని కట్టడి చేశారు. బెదిరించారు.అయినా ఒక ఫోటో బయటకు వచ్చింది.బాసర ట్రిపుల్ ఐటీలో ఏడువేల
basar-iit మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం మూడు మెస్‎లున్నాయి.ఇవి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు.

మూడు మెస్‎ల నిర్వాహకులు -అధికారులు కలిసిపోయారు.కొన్నాళ్ళుగా విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారు.భోజనాల్లో పురుగులు నిత్యకృత్యం కాగా…తాజాగా కప్పను వడ్డించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.క్యాంపస్‎లో జరుగుతున్న దారుణాలు బయటకు రాకుండా మీడియాను కట్టడి చేస్తున్నారు.క్యాంపస్‎లోకి అనుమతి ఇవ్వడం లేదు.కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు.విద్యార్థుల తిండి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు చెల్లిస్తోంది.

అయితే క్యాంపస్‎లో జరుగుతున్న విషయాలు బయటకు చెప్పినా, ఆందోళనలు చేసినా అడ్మిషన్ తొలగిస్తామని మెస్ కాంట్రాక్టర్లు హెచ్చరించడం దుమారం రేపుతోంది.

LEAVE A RESPONSE