Suryaa.co.in

National

మంగళగిరి నుంచి మధుబని చీర వరకూ..

– మంగళగిరి చేనేత చీరతో నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్
– ఇప్పుడు మధుబని చీరతో తొమ్మిదో బడ్జెట్

ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేనేత చీరలంటే మక్కువ ఎక్కువన్నది తెలిసిందే. వేలు, లక్ష రూపాయల చీర కొనే అవకాశం ఉన్నప్పటికీ ఆమె ధర తక్కువగా ఉండే చేనేత చీరలతో సింపుల్‌గా కనిపిస్తుంటారు. 2019లో మంగళగిరి చేనేత చీరతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల..2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో.. 2021లో ఎరుపు-గోధుమరంగు కలగలిసిన భూదాన్‌ పోచంపల్లి చీరలో.. 2022లో మెరూన్‌ రంగు చీరలో.. 2023లో బ్రౌన్‌ రంగులో టెంపుల్‌ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో.. 2024లో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా రామా బ్లూ రంగు చీర తో కనిపించారు.

.తన తొమ్మిదవ బడ్జెట్‌ను బీహర్‌లోని మధుబని చీర కట్టుకుని ప్రవేశపెట్టారు. ఆ చీరను పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి బహుకరించారు. తాను ఇచ్చిన చీరతోనే 9వ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న దులారీదేవి కోరికను ఆర్ధికమంత్రి తీర్చారు. బంగారు అంచుతో ఉన్న గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్‌, శాలువాతో కనిపించారు. చీరపై ఉన్న చేపల ఆర్ట్‌ ఆకట్టుకుంది. అది పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి స్వయంగా తయారుచేసిందేన

LEAVE A RESPONSE