Suryaa.co.in

Telangana

గాంధీనా? గాడ్సేనా?

– దాడి చేసే వరకు పోలీసులు ఏం చేస్తున్నారు ?
– కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి పోలీసుల వైఫల్యమా ? ప్రభుత్వ ప్రోత్సాహమా?
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై అరికెపూడి గాంధీ, అతని అనుచరుల దాడిని ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో 9 నెలలలో కొత్త రకం పాలన చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. ఎన్నికల హామీల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ దాడులు.అరికెపూడి కాంగ్రెస్ లో చేరింది నిజం .. పీఎసీ పదవి రావడంతో ఆయన నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను అన్నాడు.

మరి ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ కండువా కప్పుకోండి. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేద్దాం అన్నాడు. సమాధానం చెప్పాల్సిన అరికెపూడి అసభ్యకరంగా మాట్లాడడం, అనుచరులతో వచ్చి ఇంటి మీద దాడి చేయడం దుర్మార్గం. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, అరికెపూడి గాంధీని భారీ కాన్వాయ్ తో కౌశిక్ రెడ్డి ఇంటి వరకు ఎలా అనుమతించారు ?

రాళ్లు, పూలకుండీలు, టమాటాలతో దాడి చేసే వరకు పోలీసులు ఏం చేస్తున్నారు ? కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి పోలీసుల వైఫల్యమా ?

LEAVE A RESPONSE