ఇంటింటి చెత్త..
దానికి మునిసిపాలిటీ తట్ట
వీధి చివర ఓ కుండి..
పొద్దునే రెండు టైర్ల
ఎడ్ల బండి..
ఉన్న చెత్తను ఏరేసి
ఉన్నంతలో రోడ్లు పరిశుభ్రం!
ఇలా బానే నడిచింది గతం
సర్కారీ సేవ..
ఇప్పుడంటే ఇన్ని ఊచితాలు
అప్పుడు చెత్త సేకరణ ఫ్రీ..
మునిసిపాలిటీల చిత్తశుద్ధి టోల్ ఫ్రీ..
జనాలు కేర్ ఫ్రీ..,,!
ఇప్పుడు ఆ సేవా భారం..
పంచుతుంటే డస్ట్ బిన్నులు
ఆహా.. ఏమి భోగమని
మురిసి జనం..
జగనన్న వెంట ప్రభంజనం..
తడి చెత్త..పొడి చెత్త..
ప్రచారం..
ఆ చెత్తల సేకరణకు రథాలు..
వాటికి వైసిపి రంగులు..
సర్కారు ప్రచార హంగులు…
అంతా బాగుంది..అన్నీ ఓకే..
ఇలా మురిసే సమయానికి
పడింది పన్ను పిడుగు..
చెత్త పన్ను..
ఎప్పుడూ కనని..
కట్టని పన్ను..
పొడిచేస్తూ పౌరుడి కన్ను..!
ఇప్పుడు తెలుగు నేలపై
ఈ చెత్త పన్ను పెద్ద పేరడీ..
పేదోడి ముంగిట ప్రతి పొద్దు
సర్కారు గారడీ..
నెల తిరిగే పాటికి
కట్టు పన్ను..
ఈ వ్యవస్థకు
కార్యదర్శులే దన్ను..
ఒక్కో చోట ఒక్కో రేటు..
సర్కారీ కాటు..
ఇంతకు మునుపు ఎరుగని
ఈ వింత..జగనన్న సంత!
పొద్దున్న లేస్తే అదే ఆలోచన
ఏం పంచాలి..
అందుకు సొమ్ములెలా తేవాలి..
ఏ నిధులను
ఎలా మళ్ళించాలి..
ఒకటే సోస..
అదే ధ్యాస..
అలా చేస్తుంటే
సమాలోచన..
పుట్టింది
చెత్త పన్ను ఆలోచన..
ఇలాంటి తెలివి..
ఎన్నో సంవత్సరాల క్రితం
ఓ లక్..రాజుగారి బుర్రలో
మెరిసిన చమక్..
మళ్లీ ఇన్నాళ్ళకి
తెలుగు గడ్డపై
పన్నుల సంత..
ఈగల మోత..
మెజారిటీ నిప్పు కర్రతో
ప్రభుత్వం కీలెరిగి
పెట్టిన వాత..!
ఈఎస్కే