Suryaa.co.in

Telangana

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వండి!

– తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలను ఇవ్వాలని “తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక రాష్ట్ర కన్వీనర్ భారత సుదర్శన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల పోరాటాలు, త్యాగాల వల్లనే స్వరాష్ట్ర ఏర్పాటు సాకారమైందని, స్థబ్ధంగా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంలో “తెలంగాణ జర్నలిస్టులు” పోషించిన పాత్ర అసమాన్యమైనదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఇండ్లస్థలాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని ‘తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక’ కన్వీనర్ భారత సుదర్శన్ అన్నారు.

LEAVE A RESPONSE