Suryaa.co.in

Telangana

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకో అవకాశం ఇవ్వండి

– గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. ‘నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా. నన్ను నియమిస్తే.. పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తా. గోరక్షణకు పాటుపడే కార్యకర్తలకు రక్షణగా నిలబడతా. వీఐపీలా ఉండే వారు కాకుండా, హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తినే నియమిస్తే బాగుంటుంది’ అని తెలిపారు.

LEAVE A RESPONSE