నా కొడకల్లారా..మీ సంగతి తేలుస్తాం

– తమ్మినేని..ఎంతమంది మహిళలు నీ ఇంటికి వచ్చి ఆందోళన చేశారో చెప్పమంటావా?
– మాకూ, హరికృష్ణ గారికి టీ అందించిన వెధవ కొడాలి నాని
– వంశీ…నీ బతుకు అందరికీ తెలుసు
– దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వర రావు
నా కొడకల్లారా మీ సంగతి తేలుస్తాం. మాకూ, హరికృష్ణ గారికి టీ అందించిన వెధవ కొడాలి నాని. ఆహ్వానం హోటల్ లో నువ్వు కింద పడుకున్నావ్ రా. అరెయ్ వంశీ…నీ బతుకు అందరికీ తెలుసు. ఎంతమంది ఆడపిల్లలను నువ్వు బ్లాక్ మెయిల్ చేశావో తెలుసు. ఐఏఎస్ ఆఫీసర్లను వేదించావ్. భువనేశ్వరమ్మను అవమానిస్తూ మాట్లాడిన వారిపై డీజీపీ దిశా కింద కేసు ఎందుకు పెట్టలేదు?
స్పీకర్ కుర్చీ విలువను తమ్మినేని తీసేశారు. టీడీపీ భిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన తమ్మినేని చరిత్ర అందరికీ తెలుసు. నీ చేష్టలకు ఎంతమంది మహిళలు నీ ఇంటికి వచ్చి ఆందోళన చేశారో చెప్పమంటావా? నారా లోకేష్ గురించి తప్పుగా మాట్లాడిన మీకు పుట్టగతులుండవు. మీరు చేసిన దుర్మార్గాలను కప్పిపుచ్చుకోడానికి ఎంతకైనా దిగజారుతారని అర్ధమైంది. మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఘోర పరాభం తప్పదు. చంద్రబాబు గారు మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా శాసనసభలోకి తీసుకొస్తాము.
నిన్న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి. కానీ రాష్ట్ర ప్రజలకు చీకటి రోజు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ ముద్దుల బిడ్డ భువనేశ్వరమ్మ గారిని నిండుసభలో బుద్దిలేని గాడిదలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. వైసీపీ నేతలు ఎవరికి పుట్టారో అనే అనుమానం కలుగుతోంది. అన్నగారు తన బిడ్డలను ఎలా పెంచారో మేము కళ్లారా చూశాము. నేను ఎన్టీఆర్ అభిమానిని. అన్నగారు, చంద్రబాబు గారి వెంట నేను రాష్ట్రమంతా పర్యటించాను.
ఆ కుటుంబంపై వైసీపీ కిరాతకులు చేస్తున్న ఆరోపణలను అందరూ ఖండించాలి. మీ గంజాయి మాఫియా, బాబాయ్ గొడ్డలి పోటును మేము బయటపెట్టామని మీరు వేధింపులకు గురిచేస్తున్నారు. మీ దిగజారుడు మాటలను చంద్రబాబు గారు తట్టుకోలేకపోయారు. సభలో అంత జరగుతుంటే జగన్మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు. నీతండ్రి శవం దగ్గర సంతకాలు సేకరించావు. నీ రాజకీయం కోసం తల్లిని విశాఖ నుంచి పోటీ చేయించి ఆమె ఓటమికి కారణమయ్యావ్. వైసీపీ నేతలు రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక నేరస్థుల అడ్డాగా మార్చేశారు.
బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా చెబుతున్నా…భువనేశ్వరమ్మ గారిని తప్పుగా మాట్లాడిన వారికి మూడింది. వైసీపీ నేతలంతా డీఎన్ ఏ పరీక్షలు చేయించుకోండిరా. భువనేశ్వరమ్మ గారిని అలా మాట్లాడుతుంటే నా రక్తం ఉడిగిపోయింది. అన్నగారు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించారు. చంద్రబాబు గారు డ్వాక్రా ఏర్పాటుతో మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు ఆలోచించాలి. ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి.