ప్రజలకు చేరువలో ప్రభుత్వం

– కాలనీవాసుల కష్టాలు తీరుస్తున్నాం
– డిప్యూటీ స్పీకర్ పద్మారావు

సికింద్రాబాద్ : రూ.2.46 కోట్ల ఖర్చుతో మధురానగర్ లో ఇప్పటికే పూర్తిచేసిన కొత్త కమ్యూనిటీ హాల్ ను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. అదే విధంగా రూ. 27 లక్షల ఖర్చుతో చేపట్టిన

సివరేజి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సికింద్రాబాద్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలను సమస్యల రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

50 సంవత్సరాల కాలంలో చేపట్టని పనులను కూడా ప్రారంభించి పూర్తిచేశామని పద్మారావు గౌడ్ తెలిపారు. పేద, సామాన్యులకు కుడా అందుబాటులో నిలిచేలా ఫంక్షన్ హాల్స్ ను సికింద్రాబాద్ లో
padma1
తీర్చిదిద్దుతున్నామని, సీతాఫలమండి లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ తరహాలో, అడ్డగుట్ట లో రూ. 2.25 కోట్లు, లాలాపేట లో రూ. 6.9 కోట్లతో కొత్తగా ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.

మధురానగర్ కాలనీతో పాటు షాబాజ్ గుడా, శ్రీనివాస్ నగర్, అశోక నగర్ ప్రాంతాల్లో సివరేజ్ సమస్యల పరిష్కారానికి రూ.27 లక్షలతో కొత్త సివేరేజ్ లైన్ నిర్మాణాన్ని ప్రారంభించమని తెలిపారు. కొత్త గా సికింద్రాబాద్ పరిధిలో సివరేజ్ సమస్యల పరిష్కారానికి నికి రూ. 5.5౦ కోట్లతో 70 పనులను చేపట్టనున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు.

మధురానగర్ కాలనీ లోని ఎస్ ఆర్ ఆసుపత్రిలో డాక్టర్ సంజీవ్ రెడ్డి ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్ ను ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమారి సామల హేమ, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ దశరద్, జలమండలి జీ ఎం రమణా రెడ్డి, ఇంజినీరింగ్
padma2 అధికారులు ఆశా లత, వై కృష్ణ, మధురిమ తదితరులతో పాటు తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, మధురానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.పవన్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు.

Leave a Reply