మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు గవర్నర్

– రాష్ట్రపతి నేతృత్వంలో గవర్నర్ల సదస్సు
-ఉప రాష్ట్రపతిలో భేటీ కానున్న బిశ్వభూషణ్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ మూడురోజుల అధికారిక పర్యటన కోసం బుధవారం ఢిల్లీ బయలుదేరనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో డిల్లీలో జరిగే గవర్నర్ల సదస్సుకు గౌరవ బిశ్వభూషణ్ హాజరు కానుండగా, ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ వేదికగా ఉంది.
సదస్సు గురువారం జరగనుండగా, విభిన్న అంశాలపై రాష్ట్రపతి గవర్నర్లకు దిశా నిర్ధేశం చేయనున్నారు. అయా రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు సమర్పిస్తారు. మూడు రోజుల పర్యటనలో ప్రధమ పౌరుని వెంబడి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు ఉంటారు. పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం మాననీయ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడుతో గవర్నర్ హరిచందన్ మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం గవర్నర్ డిల్లీ నుండి విజయవాడ రాజ్ భవన్ చేరుకుంటారు. ఈ మూడు రోజుల పాటు గవర్నర్ డిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో బస చేస్తారు.