Suryaa.co.in

Telangana

బిజెపి స్ఫూర్తితో పనిచేస్తున్న గవర్నర్

– మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ ఫెడరల్ స్ఫూర్తిగా భిన్నంగా బిజెపి స్ఫూర్తితో పని చేయడం బాధాకరమని తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అన్నారు పురపాలక సంఘం చైర్మన్ల అత్యవసర కార్యవర్గ సమావేశం గురువారం హిమాయత్ నగర్ ఛాంబర్ కార్యాలాయంలో జరిగింది. ఈ సదర్భంగా మాట్లాడుతూ.. గత ఏడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ బిల్ తో పాటు మరో పది బిల్లులు చట్ట సవరణ చేసి గవర్నర్ ఆమోదానికి పంపిస్తే ఇప్పటికీ ఆమోదించకుండా పెండింగులో పెట్టారు అన్నారు. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధిని ప్రతిబిమించేలా చట్ట సవరణ చేసి ఆమోదించాలని కోరుతే బిజెపి విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటూ అడ్డుగోడల నిలుస్తున్నారు అని ఆరోపించారు.

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహిళ గవర్నర్ గా కుమ్ముద్ బెన్ జోషి ప్రజాస్వామ్య విలువలను పెంపొందింపజేసి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిస్తే రాష్ట్ర గవర్నర్ గా ఒక మహిళ విద్యావేత్త అనుభవజ్ఞురాలు తమిళ సై రావడాని తెలంగాణ ప్రజలు హర్షించారని ఆమె అందుకు భిన్నంగా ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారు అని విమర్శించారు. కేసిఆర్ కేటీఆర్ నాయకత్వంలో పురపాలక సంఘాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని దీనికి గవర్నర్ రాజకీయ కారణాలతో బిల్లులను తొక్కి పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఇటీవల కెసిఆర్ కేటీఆర్ లు 14 వేల కోట్ల రూపాయలు కేటాయించి స్పూర్తిగా నిలిస్తే గవర్నర్ అందుకు భిన్నంగా పనిచేయడం సరికాదన్నారు రాజకీయ కుట్ర కోణంలో గవర్నర్ వ్యవహరించడం మంచి సంప్రదాయం కాదని రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని విజ్ఞత గల గవర్నర్ సలహాలు ఇచ్చి బిల్లులు ఆమోదించి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

కవితకి ఛాంబర్ సంపూర్ణ మద్దతు
తెలంగాణ ఉద్యమంలో ఉవెత్తున ఉద్యమించి యావత్ మహిళలోకాన్ని తెలంగాణ సాధనలో ముందుకు తీసుకెళ్లిన కవితక్క క్రియాశీలక పాత్ర పోషించారని వెన్ రెడ్డి రాజు పేర్కొన్నారు. ఈ రోజు యావత్ భారతదేశం లో మహిళలకు చట్ట సభలో రిజర్వేషన్ కావాలని ఉద్యమించడానికి జీర్ణించుకోలేని బిజెపి లిక్కర్ స్కాం అకారణంగా అంటగట్టి ఎలాంటి ప్రమేయం లేకపోయినా వేధించడాన్ని ఛాంబర్స్ తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తులో కవితక్కకు మున్సిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతును తెలియజేయడమే కాకుండా అండగా ఉంటామని రాబోయే ఎలాంటి పరిణామాలను కూడా ఎదుర్కొనేలా తెలంగాణలోని మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్ లందరూ కూడా సంఘీభావంగా అండగా ఉండి ముందుకు వెళదామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు నర్సింహా గౌడ్, జమున, రజిని, ప్రణీత, గంగాధర్, సుదాహమేందర్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE