Suryaa.co.in

Andhra Pradesh

ఉన్నత ఆలోచనలతోనే అద్భుతమైన విజయాలు

– 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య, నైతిక విధానం బోధనా అంశంగా ఉండడం గొప్ప విషయం
– పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి మోహన్ బాబు నిదర్శనం
– తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తిరుపతి: టీం స్పిరిట్ తో మనం ఎంతమందిని ముందుకు తీసుకుపోగలుగుతున్నాం అన్న ఆలోచన ఉన్నతంగా ఉన్నప్పుడు మీరు అద్భుత విజయాలు సాధిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఆయన తిరుపతిలోని శ్రీ సాయినాథ్ నగర్ లో ఏర్పాటుచేసిన మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించి అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలు అందించారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థికి అభినందనలు తెలిపారు. ఇంతకాలం తల్లిదండ్రులు ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో మీ విద్యాభ్యాసం కొనసాగింది.. ఇకనుంచి మీ జీవితంలో కొత్త అధ్యాయాలు ప్రారంభమవుతాయి. మీ మీద తల్లిదండ్రులు మా అందరి కోరిక మేరకు జాతి భవిష్యత్తుకు గొప్పగా ఉపయోగపడాలి మీరు విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

మీరు సాధించిన సర్టిఫికెట్లతో ఏ స్థానంలో ఉన్న మీతో పాటు పదిమందికి ఉపయోగపడేలా మీ జీవితం ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఒక్కడిగా బతకడం గొప్ప విషయం కాదు మనం బతుకుతూ 10 మందిని బతికించడం చాలా గొప్ప విషయం అన్నారు.

పోటీ ప్రపంచంలో ఎదుటివారిని ఓడించడం కష్టమైన పని కాదు… ఎదుటివారిని ఓడించి గెలవడం ఒకటే ముఖ్యం కాదు. ఎదుటివారి మనసు గెలవడం ముఖ్యం మనం ఎంతమంది ఎదుటివారి మనసు గెలుస్తున్నాం, టీం స్పిరిట్ తో మనం ఎంతమందిని ముందుకు తీసుకుపోగలుగుతున్నాం అన్న ఆలోచన మీకు అద్భుత విజయాలను సాధించి పెడుతుందని హితబోధ చేశారు.

మీతో పాటు పనిచేసే, మీ కింద పనిచేసే వారు సరైన మార్గాల్లో నడిపిస్తూ వాళ్ల గెలుపునకు ఇచ్చే సూచనలు మీ గెలుపునకు దోహదం చేయడమే కాదు వారి గెలుపులో మీ గెలుపు తోడ్పడుతుంది అని భావిస్తే గొప్ప విజయాలు సాధిస్తారని తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీని మొదటిసారి సందర్శించాను. ఇప్పటివరకు వినడమే కానీ చూడలేదు.

అద్భుతంగా ఒక మానస సరోవరంలా ఉంది. నైతిక విధానం ఎలా ఉండాలో ప్రతి విద్యార్థికి విద్యాబోధనలో భాగంగా చేయడం అభినందనీయం. ప్రొఫెసర్ కి, టీచర్ కి విద్యార్థికి మధ్య పర్సనల్ బ్యాండేజ్ లేకుండా పోతున్న సమయంలో ఇక్కడ అందించేది కేవలం పర్సనల్ బ్యాండేజ్ అని తెలుసుకొని సంతోషిస్తున్నాను. భారతీయ సంస్కృతిలోని గురుకులాల బాండేజ్ విధానం ఉన్న యూనివర్సిటీ మొదటి స్నాతకోత్వానికి నేను ముఖ్య అతిథిగా రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

ఎన్ని విజయాలు సాధించిన గతాన్ని మర్చిపోకుండా వ్యవస్థలో లోపాలు సరిదిద్దుకుంటూ మోహన్ బాబు గారు ముందుకు వెళ్తున్నారు. భారత రాజ్యాంగంలోని సమానత్వం, సౌభ్రాతృత్వం అంశాలను ముందుకు తీసుకుపోయేందుకు మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారని అభినందించారు. జీవితంలో అనేక రంగాల్లో నైపుణ్యం సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకునే వారికి మోహన్ బాబు జీవితం యూనివర్సిటీ లాంటిది అన్నారు. 25 శాతం మంది విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని మోహన్ బాబు మొదటి నుంచి పెట్టుకుని ముందుకు తీసుకు పోవడం అభినందనీయం అన్నారు.

సినీ, విద్యా రంగాల్లో ఆయన సామాజిక బాధ్యతను గొప్పగా నిర్వహిస్తున్నారని తెలిపారు. విలన్ గా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని విభాగాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నటుడిగా అంత గొప్ప పేరు మోహన్ బాబు సాధించారని గుర్తు చేశారు.
సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నప్పటికీ దానికి పూర్తిగా భిన్నమైన విద్యా వ్యవస్థను ఎంపిక చేసుకొని పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు అభివృద్ధి చేసి సాధించడం ద్వారా సినీ నటుడు మోహన్ బాబు మనందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పీఈటి గా జీవితాన్ని మొదలుపెట్టి మోహన్ బాబు పద్మశ్రీ స్థాయికి ఎదగడం వెనుక గొప్ప కృషి దాగి ఉందని అన్నారు.

LEAVE A RESPONSE