ఎంపీ విజయసాయిరెడ్డి
అక్టోబర్ 19, జగనన్న ఆరోగ్య సురక్ష పథకానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా గురువారం పలు అంశాలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ నివారించదగ్గ ఆరోగ్య సమస్యలతో బాధపడకూడదన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హీలింగ్ టచ్ వంటివారని అన్నారు.
తల్లీ బిడ్డలకు ఆరోగ్య పరీక్షలు
రాష్ట్రంలో .రక్తహీనత, పౌష్టికాహార లోపం బాధితులను గుర్తిస్తూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రతినెలా హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారని, జీవనశైలి వ్యాధులు కట్టడికి నెలలో ఒకసారి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులతో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నారని అన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం బాధితులను గుర్తిస్తూ నివారణ చర్యలు చేపడుతున్నారని అన్నారు.
చంద్రబాబు ఏ “జాతి రత్నం”?
తేదేపా అగ్రనేత చంద్రబాబు జాతి రత్నం, దేశ రత్నం అని, ఆయనను కాపాడుకోవాలంటూ పచ్చపార్టీనేతలు నినాదాల చేస్తున్నారని అయితే ఆయన ఏ జాతి రత్నమో, ఏ దేశ రత్నమో, ఏ గ్రహానికి రత్నమో ఎవ్వరూ చెప్పడం లేదని, కనీసం తెలుగుదేశం పార్టీ కి రత్నమని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పచ్చనేతలు ఉన్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.
వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు
వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద అర్హులైన బీసీ లబ్దిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.10వేల సాయం అందించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. గురువారం ఈ పథకం కింద అందించిన సాయంతో గడిచిన నాలుగేళ్లలో రూ. 1252.52 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.